సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల పై పుకార్లు రావడం మాములు విషయమే. రోజూ ఎవరో ఒక హీరోయిన్ పై ఈ మధ్య పెళ్లి.. పేరంటం అంటూ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కొంత మంది హీరోయిన్స్ వాటిని టేక్ ఇట్ ఈజీ అని వదిలేస్తారు. అయితే.. కొంత మంది హీరోయిన్స్ మాత్రం సోషల్ మీడియా ద్వారా ఈ రూమర్ల పై స్పందిస్తారు. ఒకవేళ ఆ రూమర్లో నిజం లేకపోతే తమదైన శైలిలో సమాధానాలు చెబుతుంటారు. తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ హన్సికకు ఓ రూమర్ ఎదురైంది. ఆ రూమర్ ఏకంగా హన్సికకు పెళ్లి కొడుకుని తీసుకొచ్చింది. ఇటీవలే ఓ సినిమా వెబ్‌సైట్‌కు చెందిన ట్విట్టర్ పేజ్‌లో రాసిన బ్రేకింగ్ న్యూస్‌కు హన్సిక అదిరిపోయే సమాధానం ఇచ్చింది.
ట్విట్టర్లో సదరు వెబ్ సైట్ వారు.. ‘‘బ్రేకింగ్ న్యూస్: హీరోయిన్ హన్సిక మరికొద్ది రోజుల్లో ఒక వ్యాపారవేత్తను పెళ్లాడబోతున్నారు’’ అని చేసిన ట్వీట్‌కు హన్సిక స్పందించింది. ‘‘చెత్త న్యూస్! ఓరి దేవుడా, ఎవరతను?’’ అని హన్సిక ట్విట్టర్లో రిప్లై ఇచ్చింది. ఇదిలా ఉండగా ఒక ట్విట్టర్ యూజర్.. ‘‘ఓరి దేవుడా..! ఈ విషయం ఇప్పటి వరకు నాకు ఎందుకు చెప్పలేదు?’’ అని హన్సికను ప్రశ్నించాడు. అతనికి హన్సిక బదులిస్తూ.. ‘‘ఎందుకంటే.. నాకు కూడా ఇప్పుడే తెలిసింది’’ అని సరదాగా చెప్పింది. మొత్తానికి పెళ్లి రూమర్‌ను ఈ వైట్ బ్యూటీ బ్రేక్ చేసింది. ఇక అమ్మడు ప్రస్తుతం తెలుగులో ఏ సినిమా అంగీకరించలేదు. తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. హన్సిక చేస్తున్న మహా.. పార్ట్నర్ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే మహా అనే సినిమా హన్సికకు 50వ సినిమా కావడం విశేషం.