20 సంవత్సరాల్లో టచ్‌ చేయని పాయింట్‌

Update: 2016-02-11 15:30 GMT
నిజంగా ఆ మాట వింటే మాత్రం.. అస్సలు గడిచిన 20 సంవత్సరాలలో తెలుగులో టచ్‌ చేయని పాయింట్‌ అంటూ ఏముంటుంది అనే సందేహం రాక మానదు. కాని దర్శకుడు హను రాఘవపూడి మాత్రం.. తన లేటెస్టు సినిమా ''కృష్ణగాడి వీర ప్రేమ గాధ'' గురించి మాట్లాడుతూ.. అసలు 20 సంవత్సరాలలో తెలుగులో ఎవ్వరూ టచ్ చేయని ఒక పాయింట్‌ తో ఈ సినిమాను తీశానంటూ చెప్పుకొచ్చాడు.

నిజానికి ట్రైలర్‌ చూసినా.. లేదా హీరో నాని - దర్శకుడు హను చెప్పేది విన్నా కూడా.. ఈ సినిమా ఒక లవ్‌ స్టోరీ అనే విషయం తెలుస్తూనే ఉంది. ఇకపోతే ఇదొక ఇన్ఫీరియర్‌ వ్యక్తి ప్రేమకథ. తన ప్రేమ కోసం అతను ఎలా తిరగబడ్డాడు అనేదే కథ అంటున్నారు. అసలు మన డైరక్టర్‌ తేజ 'జయం' సినిమా నుండి మొన్న రిలీజయిన 'హోరా హోరి' వరకు అన్నీ ఇలాంటి కథలేగా. ఇకపోతే నాని సినిమాలో '15 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న అవకాశం ఒకటి ఇప్పుడొచ్చింది' అనే డైలాగ్‌ తో ట్రైలర్‌ లోనే ఏదో హింటిచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఒక రివెంజ్‌ యాంగిల్‌ ఉందనుకోవాలా? అలాంటప్పుడు ఇదీ పాతదేగా.

మరి 20 సంవత్సరాలుగా తెలుగులో టచ్‌ చేయని పాయింట్‌ అసలు ఏముంది బాసూ? ఎక్స్‌ట్రా టెరస్ర్టియల్‌ ఏలియన్‌ కథలు తప్ప. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ నుండి హారర్‌ వరకు.. లవ్‌ నుండి పీరియాడిక్‌ వార్‌ వరకు.. ఫ్యాంటసీ నుండి సెంటిమెంట్‌ వరకు.. అన్నింటిలోనూ చాలా వడబోసి ఆరబోసి వడియాలు పెట్టేశారు తెలుగు దర్శకులు. మరి ఈ కృష్ణగాడిలో అంత కొత్త పాయింట్‌ ఏమున్నట్లు? కొన్ని గంటల్లో తెలుస్తుందిలే ఆగండి.
Tags:    

Similar News