బుల్లి ఎన్టీఆర్ తో కొబ్బరికాయ కొట్టించారే

Update: 2017-02-10 15:31 GMT
జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభమైన విషయం ఇప్పటికే చెప్పుకున్నాం. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం.. ఇప్పుడు పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. నిర్మాత కళ్యాణ్ రామ్.. నందమూరి హరికృష్ణలు కూడా ఈ వేడుకలో పాలు పంచుకున్నారు.

అయితే.. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్. తన కుమారుడిని అరుదుగా బయట చూపించే ఎన్టీఆర్.. కొత్త మూవీ షూటింగ్ ప్రారంభానికి మాత్రం తీసుకురావడం విశేషం. జై లవ కుశ అనే టైటిల్ పరిశీలిస్తుండగా.. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో భాగంగా.. తాత హరికృష్ణ చంకనెక్కిన అభయ్ రామ్.. భలే చూడముచ్చటగా ఉన్నాడు. అమాయకమైన తన చూపులతో ఆకట్టుకున్నాడు బుల్లి ఎన్టీఆర్. అంతే కాదు.. షూటింగ్ ప్రారంభం సందర్భంగా కొబ్బరికాయ కూడా కొట్టేందుకు యత్నించాడు ఈ బుల్లి ఎన్టీఆర్.

మరి ఇంతటి బుడతడికి కొబ్బరికాయ పగలదు కదా.. అందుకే తాత హరికృష్ణ దగ్గరుండి పట్టుకుని మరీ కొబ్బరి కాయ కొట్టించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. తమ హీరో సినిమా ప్రారంభమే కాకుండా.. వారసుడిని కూడా చూసే అవకాశం దక్కడంతో నందమూరి అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News