సెక్సీ హీరోయిన్ ఎంత సింపులో!!!

Update: 2016-09-14 13:30 GMT
హీరోయిన్ అంటే ఎలా ఉండాలి? ఆ కలరింగ్.. ఆ కటింగ్.. పోజులు.. షోకులు.. ఇవన్నీ ఉంటేనే కదా భామలకు క్రేజ్. పాత కొత్త తేడాలేకుండా ఇలానే అనుకుని.. అలాగే చేసేస్తూ అదే ఫాలో అయిపోతుంటారు. కానీ కన్నడ హీరోయిన్ హరిప్రియ మాత్రం.. అలాంటి వాటికి తకిట తకిట అంటూ తాళం వేయదట. తను బాగా ఎడ్జస్టబుల్ అని చెప్పాల్సిన పని లేకుండా.. చేసి చూపిస్తోంది.

ఓ పక్కా పల్లెటూళ్లో.. హైజీన్ అనే మాట కూడా ఊహించుకోలేని ప్లేస్ లో.. ఊక మూటల మీద కూచుని భోజనం చేయమంటే? అది కూడా పాతిక-ముప్ఫై సినిమాల్లో హీరోయిన్ చేస్తుందా? మిగతావాళ్ల సంగతేమో కానీ.. హరిప్రియ మాత్రం సై అనేసింది. ఎంచక్కా మూటల మీద కూర్చుని.. స్టీల్ పళ్లేన్ని ఓ కాలిపై పెట్టుకుని.. ప్లేట్ లో అన్నం పెట్టుకుని సుబ్బరంగా భోజనం చేసేసింది. కాకపోతే మినరల్ వాటర్ బాటిల్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాలేదు లెండి. ఇవాల్టి రోజుల్లో అదేమీ పెద్ద విషయం కానే కాదు కదా.

సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ అనిపించుకునేందుకు హరిప్రియ బాగానే కష్టపడుతుంది. అలాగని అందుకోసం పెద్దగా ప్రయత్నించదని.. తన ఒరిజినల్ బిహేవియర్ అంతే అని చెబుతూ ఉంటారు మూవీ మేకర్స్. ఇలాంటి హీరోయిన్స్ ఉంటే.. నిర్మాతలకు పండగే పండగ.

Tags:    

Similar News