ఒక స్టార్ హీరో సినిమాలపై - డైలాగులపై సెటైరికల్ వేలో వేరొక హీరో సినిమాలో చూపిస్తే ఎలా ఉంటది? బ స్కూటరెళ్లి టిప్పర్ లారీని గుద్దేసినట్టు ఉండదూ? సరిగ్గా ఇలాంటి సందేహమే నిన్నటిరోజున సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా చూసినవాళ్లకు కలిగింది. సినిమా రొటీన్ కథే రొటీన్ గానే ఉంది అంటూనే జనాలంతా పగలబడి నవ్వుతూ ఈ సినిమా చూశారు. అందులో హరీష్ శంకర్ రాసుకున్న డైలాగుల మెస్మరిజం ఉంది. చాలా సన్నివేశాల్లో సాయిధరమ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ అతడి మేనమామలు చిరంజీవి - పవన్ ని పోలి ఉందన్న సంగతి పసిగట్టేశారంతా.
చిరంజీవి - పవన్ సినిమాలకు సంబంధించిన ప్రస్థావన సాయిధరమ్ చేశాడు. ఓ పాటలో ముఠామేస్ర్తి ల్యాండ్ మార్క్ స్టెప్ కూడా వేసి అదరగొట్టేశాడు. అయితే ఇలా ఓ మెగా హీరో ఇతర మెగా హీరోల్ని ఇమ్మిటేట్ చేస్తే జనాలు ఒప్పుకుంటారు కానీ, నందమూరి క్యాంపు హీరో - పైగా ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాలపై - ఎన్టీఆర్ డైలాగులపై సెటైర్ వేస్తే నందమూరి ఫ్యాన్స్ ఊరుకుంటారా? అండర్ కరెంట్ లో ఇలాంటి సందేహాలెన్నో వచ్చాయి థియేటర్లలో జనాలకు. ఎన్టీఆర్ బృందావనం - బాద్ షా - టెంపర్ సినిమాల ప్రస్థావన తెచ్చాడు సాయిధరమ్.
''ఆది తాళం.. సింహాద్రి రాగం.. టెంపర్ యోగం'' అంటూ ఒక డైలాగ్.. ''నేనేమీ మీతో బ్రాందీ తాగించి, నేను మజ్జిక తాగి.. ఇక్కడ బృందావనం చేయడానికి రాలేదు'' అంటూ మరో డైలాగ్. అలాగే కమెడియన్ తాగుబోతు రమేష్ ఓ సన్నివేశంలో దండయాత్ర.. దయాగాడి దండయాత్ర అంటూ కామెడీ చేసేశాడు. ఇవన్నీ చూస్తుంటే హరీష్ కి ఎన్టీఆర్ తో ఉన్న స్నేహం వల్ల ఇలా చేశాడా? లేక వ్యతిరేకత వల్లా? అన్న సందిగ్థంలో ప్రేక్షకులు బుర్రలు పిండేసుకున్నారు. దీనికి హరీష్ నుంచే సమాధానం రావాల్సి ఉంది.