2016 లో 'షాక్' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన హరీష్ శంకర్.. ఐదేళ్ల తర్వాత తన రెండో చిత్రం 'మిరపకాయ్' తో సక్సెస్ రుచి చూసాడు. ఆ తర్వాత 'గబ్బర్ సింగ్' మూవీతో టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. ఈ క్రమంలో 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' 'డీజే-దువ్వాడ జగన్నాథమ్' 'గద్దలకొండ గణేష్' సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసారు.
అయితే తన 12 ఏళ్ళ కెరీర్ లో ఏడు చిత్రాలను మాత్రమే డైరెక్ట్ చేసాడంటే దర్శకుడు ఎంత స్లో అండ్ స్టడీగా వెళ్తున్నారనేది అర్థమవుతుంది. చివరగా 2019 లో 'గద్దలకొండ గణేష్' చిత్రాన్ని అందించిన హరీష్ శంకర్.. మరో ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లలేకపోయారు.
పవన్ కళ్యాణ్ హీరోగా ''భవదీయుడు భగత్ సింగ్'' అనే చిత్రాన్ని ప్రకటించారు హరీశ్ శంకర్. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్ లో రానున్న సినిమా కావడంతో అనౌన్స్ మెంట్ తోనే అందరిలో అంచనాలు ఏర్పడ్డాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించాల్సి ఉంది.
కానీ ఈ సినిమా ప్రకటనలకే పరిమితమైంది. మధ్యలో అప్పుడప్పుడు కొన్ని రూమర్స్ పై దర్శక నిర్మాతలు స్పందిస్తూ ఏదొక స్టేట్మెంట్ ఇస్తున్నారు కానీ.. ఏమాత్రం ముందుకి కదల్లేదు. ఏదైతేనేం హరీష్ శంకర్ గత మూడేళ్లుగా సినిమా చేయకుండా ఉన్నారు.
అయితే చాలా కాలంగా హరీష్ శంకర్ సినిమా చేయకపోయినా నిత్యం సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఫలానా హీరోతో వర్క్ చేయబోతున్నాడని.. ఆ హీరోకి స్క్రిప్ట్ నేరెట్ చేశాడని.. ఇలా ఏదొక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది.
భవదీయుడు భగత్ సింగ్ లేట్ అవుతుండటంతో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో సినిమా చేయటానికి రెడీ అవుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రిన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ మాట్లాడుతూ.. విజయ్ ని ఒక్కసారి కలిస్తేనే పది వెబ్ సైట్స్ లో పది స్టోరీలు వస్తున్నాయి.. లెట్స్ హ్యావ్ ఫన్ అని అన్నారు. హరీష్ తో వర్క్ చేయాలని కోరుకుంటున్నట్లు ఈ సంధర్భంగా VD పేర్కొన్నారు.
కొన్ని నెలల క్రితం 'ది వారియర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టుగా హాజరైన హరీశ్.. రామ్ పోతినేని తో గతంలో ఓ సినిమా కోసం చర్చించినట్లు తెలిపారు. అంతేకాదు ఎనర్జిటిక్ హీరోతో తప్పకుండా సినిమా చేస్తానని అన్నాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మూవీ గురించి వార్తలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవితో హరీశ్ సినిమా ఉంటుందని కూడా అన్నారు.
ఇకపోతే ఇటీవల ముంబై వెళ్ళిన దర్శకుడు.. అక్కడ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో మూవీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని న్యూస్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ కాంబోని సెట్ చేస్తున్నట్లుగా నివేదికలు పేర్కొన్నాయి. ఇలా తరచుగా హరీశ్ శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి.
ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి ఏమో కానీ.. సరికొత్త కాంబినేషన్స్ తెరపైకి వస్తున్నాయి. ఇందులో ఒక్కటైనా నిజం అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన హరీశ్.. ఇలా ఏ సినిమాని డైరెక్ట్ చేయకుండా ఉండకూడదని వారు భావిస్తున్నారు. వీలైనంత త్వరగా తదుపరి చిత్రాన్ని పట్టలెక్కించాలని కోరుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.