గతుకు రోడ్ల ప్రయాణం తార్ రోడ్ ఎక్కించిన అనిల్ : దిల్ రాజు

కొవిడ్ దగ్గర నుంచి గతుకు రోడ్లలో ట్రావెల్ చేస్తున్నాం.. అలాంటి మమ్మల్ని తార్ రోడ్ ఎక్కించాడు.. ఇక తార్ రోడ్ జర్నీ కంటిన్యూ అవుతుందని అన్నారు దిల్ రాజు.

Update: 2025-02-01 12:42 GMT

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అందుకుంది. సినిమాను కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ లాభాలు అందుకున్నారు. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్స్ అంతా కలిసి గ్రాటిట్యూడ్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంక్రాంతికి వస్తున్నాం నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పాల్గొన్నారు.

ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి ఎన్నో ఈవెంట్స్ చేశాం.. సినిమా సక్సెస్ గురించి మాట్లాడాం.. ఐతే డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ పెడతామని అంటే ఆనందం అనిపించిందని అన్నారు. ఈ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్స్ కి బ్రేక్ ఈవెన్ అయితేనే సూపర్ హిట్ అని ఫిల్మ్ ఇండస్ట్రీ చెప్పుకుంటుంది. వాళ్లు నష్టపోయినా సినిమా సూపర్ హిట్ పోస్టర్స్ పడుతుంటాయి. ఏరియాల వారిగా అడిగితే సార్ మాకు ఇంత పోయిందని చెబుతారు. తాను డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నప్పుడు తొలిప్రేమ టైం లో 100 రోజుల వేడుకలో డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడించే వారు. ఐతే ఇప్పుడు సిస్టెం మొత్తం మారిపోయిందని అన్నారు దిల్ రాజు.

డిస్ట్రిబ్యూషన్ లో 90 పర్సెంట్ లాస్ 10 పర్సెంట్ సక్సెస్ ఉంటుంది. ఒక డిస్ట్రిబ్యూటర్ సక్సెస్ అవ్వాలంటే ఆ 10 పర్సెంట్ లోనే నిలదొక్కుకోవాలని అన్నారు. తమతో ఎల్.వి.ఆర్, శోభన్, హరి 2006 బొమ్మరిల్లు సినిమా నుంచి ఉన్నారు. సక్సెస్ లు ఉన్నాయి మధ్యలో అప్ అండ్ డౌన్స్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అన్ని తట్టుకుని వాళ్లు మాతో కంటిన్యూ అవుతున్నారని అన్నారు దిల్ రాజు. 20 ఏళ్లు డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాత కలిసి ఉండటం వీళ్లు తప్ప ఎవరు లేరని అన్నారు.

ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి చెబుతూ మావి రెండు రిలీజ్ లు ఉన్నాయి. కాస్త డల్ గా కనిపిస్తే అనీల్ సూపర్ హిట్ కొడుతున్నాం అని చెప్పి హిట్ కొట్టాడు. వెంకటేష్ లాంటి సీనియర్ హీరోతో 73 రోజుల్లో సినిమా పూర్తి చేసి కరెక్ట్ గా బాల్ సిక్స్ కొడితే ఎలా ఉంటుందో ప్రూవ్ చేశారని అన్నారు దిల్ రాజు.

ఇదే క్రమంలో బడ్జెట్ లు ఇంపార్టెంట్ కాదు కథలే ఇంపార్టెంట్.. మేము కూడా అలా కథలతోనే కొత్త దర్శకులతో మా సంస్థ నుంచి కొన్ని క్లాసిక్స్ ఇచ్చాము. ఐతే అందరిలాగా కాంబినేషన్ సినిమాలకు పోయి నాలుగైదు ఏళ్లుగా తడ పడ్డాం. ఐతే అనిల్ రావిపూడి మళ్లీ మాకు దారి చూపించాడు. సంక్రాంతి నుంచి మా సంస్థ నుంచి ఇలాంటి సినిమాలే వస్తాయి. నాకు ఈ సినిమా ఒక పాఠం నేర్పించిందని అన్నారు దిల్ రాజు.

అనిల్ రావిపూడితో 6 సినిమాలు చేశాం.. స్టోరీ కోసం పెద్ద సిట్టింగ్ లు ఏమి ఉండవు.. సరదాగ టీ తాగుతూ కథ చెబుతాడు.. సినిమా అయ్యాక ఎడిటింగ్ పూర్తయ్యాక చూసుకోండి అని అంటాడు. మొన్న ఆల్రెడీ శిరీష్ చెప్పినట్టుగా పడిపోతున్న మమ్మల్ని తిరిగి నిలబెట్టాడు అనిల్. మళ్లీ పది సంవత్సరాలు తిరుగు లేకుండా చేశాడు.

కొవిడ్ దగ్గర నుంచి గతుకు రోడ్లలో ట్రావెల్ చేస్తున్నాం.. అలాంటి మమ్మల్ని తార్ రోడ్ ఎక్కించాడు.. ఇక తార్ రోడ్ జర్నీ కంటిన్యూ అవుతుందని అన్నారు దిల్ రాజు. ప్రొడ్యూసర్స్ కి ఒక హీరోగా ఎలా సపోర్ట్ చేయాలో దానికి మించి వెంకటేష్ గారు చేశారని. ఆయన వల్లే ఇంత గొప్ప సక్సెస్ సాధ్యమైందని అన్నారు దిల్ రాజు.

Tags:    

Similar News