ఆటగాడు.. 8 నెలలు 8 సినిమాలు

ఇదిలా ఉంటే తాజాగా నా అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేశాడు. 8 నెలల్లో 8 సినిమాలు నేను హీరోగా రిలీజ్ చేయబోతున్నాను. ఏఐ ఉపయోగించి ఈ సినిమాలు తెరకెక్కించబోతున్నాం.

Update: 2025-02-01 13:12 GMT

ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యుట్యూబ్ లో ట్రావెలర్ వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి అతను తెలుసు. ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ అక్కడి విశేషాలని తన యుట్యూబ్ ఛానల్స్ ద్వారా ఆసక్తికరంగా పంచుకుంటూ ఉంటాడు. అందుకే నా అన్వేష్ కి మిళియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. అతను యుట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేస్తే లక్షల్లో వ్యూవ్స్ వస్తూ ఉంటాయి.

ఇండియాలో అత్యధికంగా సంపాదిస్తున్న యుట్యూబర్ గా నా అన్వేష్ ఉన్నారు. అతను ఏ దేశం వెళ్లిన అక్కడి అమ్మాయిలతో సరదాగా మూవ్ అవుతూ వారిని తనతో పాటు దేశం మొత్తం తిప్పుతాడు. ఇక నా అన్వేష్ వీడియోలు సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. అతని మాటలు, సెటైర్స్, కామెడీ అందరిని ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా నా అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేశాడు. 8 నెలల్లో 8 సినిమాలు నేను హీరోగా రిలీజ్ చేయబోతున్నాను. ఏఐ ఉపయోగించి ఈ సినిమాలు తెరకెక్కించబోతున్నాం. అందరి హీరోల పేర్లకి ముందు స్టార్ అని ఉన్నట్లే నన్ను కూడా ఏదో ఒక స్టార్ తగిలించుకోమని ప్రొడ్యూసర్స్ చెప్పారు. అయితే ఏ స్టార్ పెట్టుకోవాలో నాకు తెలియడం లేదు.

మీరు సజిస్ట్ చేస్తే అదే స్టార్ నా పేరు ముందు పెట్టుకుంటాను. నేను ఇరాన్ దేశంలో ఉన్నాను. పర్షియన్ మూవీ చేయబోతున్నాను. ఈ సినిమాలో పర్షియన్ అమ్మాయి హీరోయిన్ గా చేయబోతోంది. ఈ ఎనిమిది నెలలు ఎనిమిది సినిమాలు రిలీజ్ చేస్తాము. థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ కుదరకపోతే ఓటీటీలో ప్రయత్నం చేస్తాం. అక్కడ తీసుకోకపోతే ఎలాగూ నా యుట్యూబ్ ఛానల్ ఉంది కదా అందులో రిలీజ్ చేస్తాను అని నా అన్వేష్ వీడియోలో చెప్పుకొచ్చాడు.

‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కల్కి’ రేంజ్ లో ఈ సినిమాలు ఉండబోతున్నాయి. కచ్చితంగా మీ అందరికి నచ్చుతాయని నా అన్వేష్ చెప్పాడు. దీనిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. అతనికిరకరకాల పేర్లతో స్టార్ బిరుదులు ఇస్తున్నారు. కొంతమంది సినిమాకి టైటిల్స్ కూడా పెట్టేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఏఐ టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ సినిమాలు అన్ని చేయబోతున్నామని నా అన్వేష్ చెప్పారు. మరి ఇది నిజమేనా లేదంటే సరదాగా చెప్పాడా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే అతనికి సినిమాలలో యాక్టర్ గా అవకాశాలు వచ్చిన కూడా చేయలేదు. ఈ విషయాన్ని పలు వీడియోలలో అతనే చెప్పాడు. మరి ఈ ఎనిమిది నెలల్లో ఎనిమిది సినిమాల సంగతి ఏంటనేది చూడాలి.

Tags:    

Similar News