వందల కోట్ల బడ్జెట్ కాదు కంటెంట్ ఉన్న సినిమా కావాలి..!

అంతేకాదు ఈ సినిమా ద్వారా అనిల్ రావిపూడి గారు ఒక పాఠం చెప్పారని అన్నారు ఎల్.వి.ఆర్. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామన్నది కాదు.. 200, 300 కోట్లు ఖర్చు పెట్టడం కాదు అందులో కంటెంట్ ఉండాలి.

Update: 2025-02-01 13:02 GMT

ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు వెంకటేష్ అండ్ టీం. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా పండగకి రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దాదాపు ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఐతే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా లాభాలు తెచ్చి పెట్టింది. అందుకే లేటెస్ట్ గా సినిమా దర్శక నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఒక సెలబ్రేషన్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ ఈవెంట్ లో వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ ఎల్.వి.ఆర్ స్పీచ్ ఆకట్టుకుంది. వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు, శిరీష్ గార్లతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు ఎల్.వి.ఆర్. అనిల్ రావిపూడి మొదటి సినిమా నుంచి కూడా తానే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు ఎల్.వి.ఆర్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా చాలా సంవత్సరాల తర్వాత డిస్ట్రిబ్యూటర్లకు మంచి సంక్రాంతి అని అన్నారు ఎల్.వి.ఆర్.

డిస్ట్రిబ్యూటర్లు 20 పర్సెంట్ కమిషన్ చూసి చాలా సంవత్సరాలు అయ్యింది. అందుకే ఈ సినిమా సెలబ్రేషన్ మా ద్వారా జరగాలని అనుకున్నా. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఇలా డిస్ట్రిబ్యూటర్లు సెలబ్రేట్ చేయడం జరగలేదని ఇది ఫస్ట్ టైం అని అన్నారు ఎల్.వి.ఆర్. మీరు సక్సెస్ మీట్ చేయడం కాదు మే చేస్తామని చెప్పి ఇలా డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూట్ మీట్ ఏర్పాటు చేశామని అన్నారు ఎల్.వి.ఆర్.

అంతేకాదు ఈ సినిమా ద్వారా అనిల్ రావిపూడి గారు ఒక పాఠం చెప్పారని అన్నారు ఎల్.వి.ఆర్. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామన్నది కాదు.. 200, 300 కోట్లు ఖర్చు పెట్టడం కాదు అందులో కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు సినిమాను చూస్తారని ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేశారు అనిల్ రావిపూడి అని అన్నారు ఎల్.వి.ఆర్. 5 నుంచి 10 ఏళ్లుగా థియేటర్ కు రాని ఆడియన్స్ ఈ సినిమాకు కదిలారు. మంచి సినిమా తీస్తే మేము చూడడానికి రెడీగా ఉన్నామని ప్రూవ్ చేశారు. మంచి సినిమా కోసం జనం వెయిట్ చేస్తున్నారని అన్నారు ఎల్.వి.ఆర్.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా చాలా సంవత్సరాల తర్వాత మా అందరికీ ఒక సెలబ్రేషన్ అని అన్నారు ఎల్.వి.ఆర్. అనిల్ రావిపూడి నిర్మాతల డైరెక్టర్.. 73 రోజుల్లో సినిమా పూర్తి చేశారు. ఆయన ఫ్యూచర్ లో కూడా ఇలాంటి సినిమాలు ఇంకా చేయాలని.. దిల్ రాజు గారి నుంచి ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలే ఆశిస్తున్నారు. ప్రతి సంక్రాంతికి ఇలాంటి సినిమా ఒకటి ఇవ్వాలని అన్నారు ఎల్.వి.ఆర్.

Tags:    

Similar News