కోవిడ్ -19 దెబ్బకు సెలబ్రిటీలకు ఓ పెద్ద చిక్కొచ్చి పడింది. నిజంగా మనసులో దానం చెయ్యాలని ఉన్నా.. లేకపోయినా విరాళం ప్రకటించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ ఎవరైనా విరాళం ప్రకటించక పోయినా లేక విరాళం ఇచ్చి కూడా పబ్లిక్ గా చెప్పకపోయినా వారిని నెటిజన్లు గట్టిగా తగులుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. సెలబ్రిటీలు ఇవ్వాలి అనే డిమాండ్ ప్రస్తుత పరిస్థితుల్లో సమంజసమైనదే. కానీ ఈ డిమాండ్ చేసే మేథావులు తమవంతుగా కనీసం ఒక రూపాయ అయినా విరాళం ఇచ్చారా లేదా కనీసం ఒక బ్రెడ్ ప్యాకెట్ అయినా సాయం చేశారా అన్నది లోతుగా ఆలోచించాల్సిన అంశం. "సెలబ్రిటీలు చెయ్యాలంటే చెయ్యాలంతే".. ఇలా డిమాండ్ చేసేవారు మాత్రం ఒక్క రూపాయ కూడా తీయరా? ఎందుకంటే బాధ్యత అందరికీ ఉంటుంది. ఒక్క సెలబ్రిటీలకే కాదు. తక్కువ డబ్బు ఉందంటే వంద రూపాయాలే చెయ్యండి.. అంతే కానీ సెలెబ్రిటీలే చెయ్యాలి మేము చెయ్యము అంటే కుదురుతుందా? కెసీఆర్ గారు వాత పెట్టి మరీ 50% ఉద్యోగుల నుంచి లాక్కున్నట్టు లాక్కుంటారు!
రీసెంట్ గా హరీష్ శంకర్ ను ఈ విషయంలో ఒక నెటిజన్ గట్టిగా ప్రశ్నించాడు. ఇంతకీ ఏంజరిగిందంటే కరోనా వైరస్ వల్ల ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు బాసటగా నిలిచేందుకు టాలీవుడ్ ప్రముఖులు కరోనా క్రైసిస్ ఛారిటీని ప్రారంభించారు. పలువురు సెలెబ్రిటీలు ఈ సిసిసి కి తమ విరాళాలు అందజేస్తున్నారు. ఈ ఛారిటీకి విరాళం అందించిన సాయి ధరమ్ తేజ్ ను అభినందిస్తూ హరీష్ శంకర్ ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు స్పందిస్తూ ఒక నెటిజన్ వెటకారంగా "అందరికీ డప్పుకొట్టడమేనా.. మీరు కూడా ఏదైనా ఇచ్చేది ఉందా హరీష్ గారు" అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి స్పందించిన హరీష్ "మీరు మంచి భాషలో అడిగి ఉంటే నేను కచ్చితంగా బదులిచ్చే వాడిని" అంటూ రిప్లై ఇచ్చాడు. ఇది నిన్న జరిగింది.
ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ హ్యూమానిటీ అనే సంస్థ తమకు హరీష్ అందించిన సాయం గురించి వెల్లడించింది. హరీష్ తన పుట్టిన రోజు సందర్భంగా తమ సంస్థకు రెండు నెలలకు సరిపడా నిత్యావసరాలనుఅందించారని.. స్వీట్స్.. స్నాక్స్.. డ్రై ఫ్రూట్స్.. కేక్స్ కూడా అందించారని తెలుపుతూ.. హరీష్ కు హ్యాపీ బర్త్ డేచెప్పారు. ఈ సంస్థలో 45 మంది పిల్లలుఉన్నారట. ఈ సంస్థ చేసిన ట్వీట్ కు స్పందించిన హరీష్ "హోమ్ లోనే ఉండండి .. జాగ్రత్తగా ఉండండి" అంటూ రిప్లై ఇచ్చారు. హరీష్ చేసిన సాయానికి చాలామంది నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. నిజానికి ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే కొంతమంది ప్రముఖులు తమ విరాళం గురించి బహిరంగంగా చెప్పుకోరు. మరి అలాంటి వారిని విరాళం విరాళం విరాళం అంటూ వేధిస్తే ఎలా?