సినిమాలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో మంది వెండి తెరపై కి వస్తారు. కానీ కొన్ని సార్లు ఆ ప్రయత్నంలో క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ గా చేయాల్సి వస్తోంది. చాలా మంది హీరోలు మొదట సైడ్ హీరో క్యారెక్టర్స్ చేసి ఇప్పుడు వారికంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. అదే స్థాయిలో ఒక యువ హీరో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా చిన్న పాత్రలనైన తనదైన శైలిలో చేస్తూ.. మెప్పిస్తున్నాడు.
అతను ఎవరో కాదు తకిట తకిట సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చి అవును సినిమాతో మెప్పించిన హర్షవర్ధన్ రానే. రాజమండ్రి కి చెందిన ఈ తెలుగబ్బాయి బాలీవుడ్ లో కూడా ప్రత్యేక పాత్రలతో అలరించాడు. తెలుగులో కూడా తన నటనతో ఆకట్టుకుంటున్నాడు. ప్రేమ ఇష్క్ కాదల్ తో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా ఫిదా సినిమాలో భానుమతి పక్కింటి అబ్బాయి రోల్ చేసి పర్వాలేదు అనిపించాడు. ఇక రీసెంట్ గా బాలీవుడ్ లో ఒక బిగ్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ దక్కించుకున్నాడు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు జేపీ.దత్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పల్టన్ అనే బాలీవుడ్ వార్ డ్రామా కథలో లీడ్ రోల్ లో నటించనున్నాడు.
ముందుగా ఆ పాత్రకు అభిషేక్ బచ్చన్ ని అనుకున్నారట కానీ అనుకోని కారణాల వల్ల అతను తప్పుకోవడంతో హర్షా కి అదృష్టం దక్కింది. ఇన్నేళ్ల కెరీర్ లో ఈ యువ హీరోకి ఇదే పెద్ద ఛాన్స్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లడక్ లో స్టార్ట్ అయ్యింది. 2018 సమ్మర్ లో సినిమా రిలీజ్ కానుందని సమాచారం.