మహర్షి షూటింగ్ లో తలమునకలవుతూ ఫుల్ బిజీ గా ఉన్న మహేష్ బాబు తర్వాత చేయబోయే సినిమాల విషయంలో క్లారిటీ ఉన్నట్టే ఉంది కాని ఏదో ఇన్ఫర్మేషన్ మిస్ అవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ ఇంతకు ముందే కన్ఫర్మ్ అయినప్పటికీ కథ విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదనే మాటే వినిపిస్తోంది. ఎలాగూ ఇంకా నాలుగు నెలల కు పైగా టైం ఉంది కాబట్టి అప్పటికంతా సెట్ చేయోచ్చనే అంచనాలో ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే సుకుమార్ ది ఒకవేళ లేట్ అయితే ఏం చేయాలి అనే ఆలోచన కూడా రాకపోదు.
ఇక్కడే గీత ఆర్ట్స్ రంగప్రవేశం చేయబోతున్నట్టు సమాచారం. ఒక వేళ మహేష్ కనక ఒప్పుకుంటే గీత ఆర్ట్స్ మెయిన్ బ్యానర్ లో మెగా ఫ్యామిలీ కాకుండా ఇతర హీరో నటించిన మొదటి సినిమా ఇదే అవుతుంది. అయితే దర్శకుడు ఎవరు అనే ప్రశ్నకు కూడా సమాధానం రెడీ గా ఉందట. అర్జున్ రెడ్డి తో బాలీవుడ్ రీమేక్ ఆఫర్ సైతం తననే వరించేలా చేసుకున్న సందీప్ రెడ్డి వంగాని దీని కోసం రంగంలోకి దించుతున్నట్టు టాక్. అర్జున్ రెడ్డి విడుదలైనప్పుడే తన పనితనంతో మహేష్ బాబుని విపరీతంగా ఆకట్టుకున్న సందీప్ ఆ తర్వాత మహేష్ కు సూటయ్యే కథను సెట్ చేయడంలో ఆలస్యం చేయడంతో అతను కాస్త తన మొదటి సినిమా రీమేక్ ను షాహిద్ కపూర్ తో హిందిలో రూపొందించడంలో బిజీ అయిపోయాడు.
సో మహర్షి పూర్తి చేసి మహేష్ ఫ్రీ అయ్యే టైంకు సుకుమార్ కనక కథను సిద్ధం చేయలేకపోతే సందీప్ కు ఛాన్స్ రావొచ్చు. అది కూడా స్టొరీ రెడీ గా ఉంటేనే సుమా. అయితే కబీర్ సింగ్ షూటింగ్ తో పాటు ప్రమోషన్ పూర్తవ్వడానికి ఇంకా ఆరు నెలల టైం పడుతుంది. మరి ఈ మహేష్ గీత సందీప్ కాంబినేషన్ అంత ఈజీ గా సెట్ అవుతుందా వేచి చూడాలి