తెలుగు సినిమాకు కేజీఎఫ్ ఫీవ‌ర్ ప‌ట్టుకుందా?

Update: 2023-01-17 15:30 GMT
గ‌త ఏడాది ఏప్రిల్ లో విడుద‌లైన పాన్ ఇండియా సంచ‌ల‌నం 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2'. కేజీఎఫ్ కు సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ వ‌ర‌ల్డ్‌వైడ్ గా సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. అంతే కాకుండా ఈమూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వ‌ద్ద 1250 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌నే ఔరా అనిపించింది. ఈ మూవీ ఈ రేంజ్ లో వ‌సూళ్ల వ‌ర్షం కురిపించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఎలివేష‌న్స్‌. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ నుంచి ప్ర‌తీ సీన్ లోనూ ఓ రేంజ్ లో ఎలివేష‌న్స్ వున్నాయి.

దేశ వ్యాప్తంగా రైడ్ జ‌రిగిన సంద‌ర్భంలో సీబీఐ బృందానికి బిస్కెట్ దొరికిన సంద‌ర్భంలో య‌ష్ క్యారెక్ట‌ర్ కు ఇచ్చిన ఎలివేష‌న్స్ ఓవ‌ర్ గా అనిపించినా అవే సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచి హైలైట్ అయ్యాయి. ప్రేక్ష‌కుల‌ని థియేట‌ర్ల‌కు మ‌ళ్లీ మ‌ళ్లీ రిపీటెడ్ గా ర‌ప్పించాయి. ఇప్పుడు ఇదే ఫీవ‌ర్ టాలీవుడ్ కు ప‌ట్టుకుందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. వివ‌రాల్లోకి వెళితే...ఈ సంక్రాంతికి విడుద‌లైన సినిమ‌యాలు 'వాల్తేరు వీర‌య్య‌', వీర సింహారెడ్డి.

ఈ రెండు సినిమాల్లో ముందుగా నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన 'వీర సింహారెడ్డి' మూవీ జ‌న‌వ‌రి 12న విడుద‌లైంది. 'క్రాక్‌' మూవీతో ట్రాక్ లోకి వ‌చ్చేసిన గోపీచంద్ మ‌లినేని ఈ మూవీని తెర‌కెక్కించాడు. స్వ‌త‌హాగా బాల‌య్య‌కు వీరాభిమాని కావ‌డంతో ఎక్క‌డా లేపాలో అక్క‌డ లేపుతూ బాల‌య్య క‌నిపించిన ప్ర‌తీ సీన్ లోనూ వీర ఎలివేష‌న్స్ ఇచ్చాడు. యాక్ష‌న్ ఘ‌ట్టాల్లో ఈ ఎలివేష‌న్స్ పీక్స్ కి చేరుకుని ఎలివేష‌న్ కి ప‌రాకాష్ట‌గా మారాయి. ఓ ద‌శ‌లో ఏం ఎలివేష‌న్ లు రా బాబూ అని అనుకునేంత‌గా వున్నాయ‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

ఇక చిరు న‌టించిన 'వాల్తేరు వీర‌య్య‌' జ‌న‌వ‌రి 13న భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. 'ఆచార్య‌'తో డిజాస్ట‌ర్ ని ద‌క్కించుకున్న చిరు ఆ త‌రువాత 'గాడ్ ఫాద‌ర్‌'తో ఫ‌ర‌వాలేద‌నిపించారు. అయితే ఈ సారి బాక్సాఫీస్ ని ర‌ప్ఫాడించాల‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్న చిరు త‌న‌కు వీరాభిమాని అయిన బాబి డైరెక్ష‌న్ లో ఈ మూవీ చేశాడు. ఇంకే ముందు ఓ అభిమాని చిరుతో సినిమా చేస్తే ఎలా వుంటుంది?.. ఫ్యాన్స్ కి పూన‌కాలు తెప్పించేలా వుంటుంది. స‌రిగ్గా బాబి 'వాల్తేరు వీర‌య్య‌' సీన్స్ ని, యాక్ష‌న్ ఘ‌ట్టాల‌ని, చిరు ఎంట్రీని అదే స్థాయిలో డిజైన్ చేశాడు.

చిరు క్యారెక్ట‌ర్ కు ప్ర‌తీ సీన్ లోనూ ఓ రేంజ్ ఎలివేష‌న్స్ ఇస్తూ పోయాడు. ఫ్యాన్స్ కి ఓకే కానీ సాధార‌ణ ప్రేక్ష‌కుడికి మాత్రం ఈ ఎలివేష‌న్ లు ఈజీగా తెలిసిపోతూ కొంత ఇబ్క‌బందిక‌రంగా.. మ‌రీ ఓవ‌ర్ గా లేదూ అనే విధంగా మారుతాయి. స‌రిగ్గా సాధార‌ణ ప్రేక్ష‌కుడు కూడా 'వాల్తేరు లోని ఎలివేష‌న్స్ చూసి ఇలాగే పీల‌వుతున్నాడ‌ట‌. 'కేజీఎఫ్'లో ఎలివేష‌న్స్ వున్నాయి. కానీ అతిగా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. కొన్ని చోట్ల అనిపించే లోపే సీన్ అయిపోవ‌డం.. అందుకు త‌గ్గ లీడ్ ని ద‌ర్శ‌కుడు బ‌లంగా చూపించ‌డంతో సినిమాలో ఒక‌టి అర వంటివి అతిగా అనిపించి వుండొచ్చు.

కానీ వాల్తేరు వీర‌య్య‌, వీర సింహారెడ్డి సినిమాల్లో ఎలివేష‌న్స్ చాలా వ‌ర‌కు అతిగానే అనిపించి సాధార‌ణ ప్రేక్ష‌కుడికి విసుగు తెప్పించాయనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ రెండు సినిమాల డైరెక్ట‌ర్లు ఎలివేష‌న్స్ విష‌యంలో 'కేజీఎఫ్'ని ఫాలో అయిన‌ట్టుగానే క‌నిపించిందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. బాహుబ‌లి, RRRలో హీరోల ఎలివేష‌న్స్ వున్నా అవి ఆ క‌థ‌ల‌కు న‌ప్పాయి అందుకే ఎవ‌రూ వాటిని అతిగా ఫీల‌వ్వ‌లేదు. కానీ వాల్తేరు వీర‌య్య‌, వీర సింహారెడ్డి సినిమాల్లో ఎలివేష‌న్స్ చాలా వ‌ర‌కు అతిగా వుండ‌టం గ‌మ‌నార్హం. అయితే ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే ఈ రెండు సినిమాలు సంక్రాంతి బ‌రిలో నిలిచి భారీ వ‌సూళ్ల దిశ‌గా ప‌య‌నిస్తుండ‌టం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News