రేణుదేశాయ్ ఆరోగ్యం సరిగా లేదా?

Update: 2019-01-10 12:50 GMT
రేణుదేశాయి తరచుగా ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉండే వ్యక్తి.  ఈమధ్య తన కవితల పుస్తకం 'ఎ లవ్, అన్ కండిషనల్' ప్రమోట్ చేసేందుకు హైదరాబాద్ కు వచ్చి పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది.  ఆమె ఇంటర్వ్యూలన్ని అటూ ఇటూ తిరిగి పవన్.. పవన్ పిల్లల దగ్గరే అగుతాయని తెలిసిందే. ఈ విషయమేమో గానీ తాజాగా రేణుకు ఆరోగ్యం సరిగాలేదని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

రేణు దేశాయ్ తో మంచి స్నేహం  ఉన్న ఒక తెలుగు నిర్మాత తను నిర్మించనున్న సినిమాలో హీరో మదర్ పాత్ర కోసం రేణును అనుకున్నాడట.  చాలా రోజుల తర్వాత ఆమె తెలుగు సినిమాలో నటిస్తే సినిమాకు అడ్వాంటేజ్ అవుతుందని భావించి ఆమెను తన సినిమాలో నటించాల్సిందిగా కోరాడట.  కానీ ఆ నిర్మాత ప్రతిపాదనను రేణు సున్నితంగా తిరస్కరించిందట. తనకు ఆరోగ్యం సరిగా లేదని.. కొన్నాళ్ల పాటు విశ్రాంతి అవసరమని.. అందుకే సినిమాలో నటించలేనని చెప్పిందట.

సాధారణ పరిస్థితుల్లో అయితే మొహమాటానికైనా ఆ నిర్మాత ఆఫర్ ను యాక్సెప్ట్ చేసి ఉండేదని.. ఇలా రిజెక్ట్ చేసిందంటే నిజంగానే రేణు దేశాయ్ కు ఆరోగ్యం సరిగా లేదని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.  కానీ ఈ విషయం పై రేణు మాత్రం ఇంతవరకూ ఏమీ మాట్లాడలేదు.
   


Full View

Tags:    

Similar News