కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన 'కేజీఎఫ్' సిరీస్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టించాయి. ఫస్ట్ చాప్టర్ ని మించి 'కేజీఎఫ్ చాప్టర్ 2' సరికొత్త చరిత్రని సృష్టించి విడుదలైన అన్ని భాషల్లోనూ రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించి ట్రేడ్ వర్గాలనే విస్మయానికి గురిచేసింది. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ల జాబితాలో చేరిపోగా హీరో యష్ దేశ విదేశాల్లో భారీ క్రేజ్ ని దక్కించుకోవడమే కాకుండా రాఖీ భాయ్ గా చిన్న పిల్లల్లోనూ ఫేమస్ అయిపోయాడు.
ఎక్కడ చూసినా రాఖీ రాఖీ అంటూ యష్ పేరు మారుమ్రోగుతోంది. రెండే రెండు సినిమాలతో దేశ వ్యాప్తంగా ఊహించని స్థాయిలో క్రేజ్ ని దక్కించుకున్నాడు యష్. దీంతో యష్ తదుపరి సినిమా ఏంటీ? ..'కేజీఎఫ్ 2' ఎండింగ్ లో చూపించినట్టుగా పార్ట్ 3ని చేచయబోతున్నాడా? .. లేక మరో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడా అనే చర్చ సర్వత్రా మొదలైంది. 'కేజీఎఫ్ 2' విడుదలై 210 రోజులు పూర్తవుతోంది. అయినా సరే ఇప్పటికీ యష్ నుంచి తదుపరి సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ రాలేదు.
రావడం లేదు. 'కేజీఎఫ్ 2' తరువాత యష్ కు భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీస్ లో నటించే అవకాశాలు వస్తున్నాయని, శంకర్ డైరెక్షన్ లో నటించడానికి రెడీ అవుతున్నాడని వార్తలు షికారు చేశాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, యష్ ఇప్పటికీ తదుపరిప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని క్లారిటీ రావడంతో శంకర్ ప్రాజెక్ట్ గాసిప్ అని తేలిపోయింది. ఇక 'ముఫ్తీ' డైరెక్టర్ నర్తన్ తో యష్ తన తదుపరి సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వినిపించాయి.
అవి కూడా రూమర్సే అని తేలడంతో యష్ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఇదే సమయంలో బాలీవుడ్ కు చెందిన ఇద్దరు క్రేజీ డైరెక్టర్స్ ఓం ప్రకాష్ మెహ్రా, కరణ్ జోహార్ ల నుంచి రెండు క్రేజీ ఆఫర్లు వచ్చాయని ప్రచారం మొదలైంది. ఓం ప్రకాష్ మెహ్రా మహాభారతం ఆధారంగా 'కర్ణ' మూవీని తెరపైకి తీసుకురాబోతున్నాడని, అందులోని టైటిల్ పాత్ర కోసం యష్ ని చిత్ర బృందం సంప్రదించిందని వార్తలు మొదలయ్యాయి.
అంతే కాకుండా కరణ్ జోహార్ , అయాన్ ముఖర్జీల 'బ్రహ్మాస్త్ర 2' కోసం కూడా యష్ ని స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఇటీవల సంప్రదించారని, యష్ తో చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, యష్ ని తాము సంప్రదించలేదని కరణ్ జోహార్ క్లారిటీ ఇచ్చారు. రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా 'కర్ణ'లోనూ యష్ నటించడం లేదని తేలడంతో యష్ అభిమానులు షాక్ కు గురయ్యారట. 'కేజీఎఫ్' విడుదలై 210 రోజులు దాటుతున్నా యష్ తన తదుపరి సినిమాని ఎందుకు ప్రకటించడం లేదో అర్థం కావడం లేదని ఫ్యాన్స్ అసహనాన్ని ప్రదర్శిస్తున్నారట.
'కేజీఎఫ్2' సంచలన విజయాన్ని క్యాష్ చేసుకోకుండా అత్యంత కీలకమైన టైమ్ ని యష్ ఇలా ఎందుకు వేస్ట్ చేస్తున్నాడో ఎవరికీ అంతు చిక్కడం లేదు. రాఖీభాయ్ లో ఇప్పటికీ క్లారిటీ రాలేదా?.. అందుకే తన క్రేజ్ ని మరింత హైట్స్ కి తీసుకెళ్లే స్క్రిప్ట్, డైరెక్టర్ కోసమే యష్ ఇన్ని రోజులు ఎదురుచూస్తున్నాడా? అని అంతటా చర్చ జరుగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.