తెలుగు సినిమాకు మళ్లీ స్వర్ణయుగం మొదలైందా? అంటే టాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తే అది నిజమేనంటున్నారు. `బాహుబలి` తరువాత తెలుగు సినిమా అంటే యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక్కడ ఏ సినిమా మొదలైనా క్రేజీ నిర్మాతలు ఆరా తీస్తున్నారు. ఎంత భారీ మొత్తం అయినా సరే ఇచ్చేసి ఇతర బాషల హక్కుల్ని సొంతం చేసుకోవడానికి వెనుకాడటం లేదు. దీంతో తెలుగు సినిమాకు దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది.
తాజాగా ఈ విషయం ఎనర్జిటిక్ హీరో రామ్ సినిమాతో మరోసారి రుజువైంది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `ది వారియర్`. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఎన్. లింగుసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాస చిట్టూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ రామ్ కెరీర్ లోనే తొలి ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతోంది.
ఈ సినిమాతో రామ్ తొలి సారి తమిళ ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ప్రాజెక్ట్ ప్రకటించిన దగ్గరి నుంచి ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు ఎన్. లింగుసామి గత చిత్రాలు ఆశించిన విజయాల్ని సాధించకపోవడంతో ఈ చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గని రీతిలో ఈ మూవీలో హీరో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. తాజాగా ఈ మూవీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. 16 కోట్లకు ఓ బాలీవుడ్ సంస్థ సొంతం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రామ్ కెరీర్‌లో ఇంత పెద్ద మొత్తం డబ్బింగ్ వెర్షన్ రైట్స్ కి లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా కృతిశెట్టి హీరోయిన్ గా, అక్షర గౌడ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ చిత్ర తాజా షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. చిత్రీకరణ దశలోనే భారీ ఆఫర్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ రిలీజ్ తరువాత ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.