విష్వక్ సేన్ మరో దేవరకొండనా?

Update: 2019-02-14 08:15 GMT
బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కే సినిమాల సంఖ్య ఈమధ్య టాలీవుడ్ లో పెరుగుతోంది.  అదే ట్రెండ్లో ప్రేక్షకుల ముందుకు రానున్న మరో సినిమా 'ఫలక్ నుమా దాస్'.  'ఈ నగరానికి ఏమైంది' సినిమాలో నటించిన విష్వక్ సేన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా దర్శకత్వం వహించి నిర్మించడం విశేషం.  ఈ సినిమా టీజర్ నిన్నే రిలీజ్ అయింది.  ఈ టీజర్ లాంచ్ ఈవెంట్లో విష్వక్ సేన్ అన్సర్లు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

"ఈ సినిమా టీజర్ హార్డ్ గా ఉంది కదా?" అని అడిగితే.. "ఈ సినిమాను తీసింది నాలాంటోళ్ళ కోసం" అని చెప్పాడు.  "మరి మీలాంటోళ్లకు సినిమాకు మధ్య సెన్సార్ అనేది ఒకటుంది కదా?" అనే ప్రశ్న ఎదురైంది.  దీనికి సమాధానం ఇస్తూ "థియేటర్ బయట సినిమా అయితే చచ్చిపోదు కదా. నేను చచ్చిపోయిన తర్వాత కూడా వందేళ్ళు సినిమా బతికే ఉంటుంది" అంటూ షాకింగ్ అన్సర్ ఇచ్చాడు.   మరో విలేఖరి "అసలు  దాస్ ఎమోషన్ ఏంటి?" అని అడిగితే.. దానికి సమాధానంగా "టీజర్ ఇంకోసారి చూస్తారా" అన్నాడు. టాపిక్ ను మళ్ళీ కంటిన్యూ చేస్తూ "ఎమోషన్ అనేది రేజ్.  నిజాయితీగా ఉన్నవాడికి పొగరెక్కువగా ఉంటుంది. హైదరాబాద్ లో అందరికీ పొగరెక్కువ అని నా ఫీలింగ్.  ఊరికే ఎవరైనా ఇలా మనల్ని చూస్తేనే 'క్యా గూర్ రహా హై బే' అని అని కొట్లాటలు పెట్టుకుంటారు. కొట్లాటలు మొదలయ్యేందుకు పెద్ద పాయింట్ అవసరం లేదు.  సో.. ఆ రేజ్ మీద తీసిన సినిమా ఇది" అన్నాడు.

తరుణ్ భాస్కర్ గురించి అడిగితే "తరుణ్ మాకు ప్రతి సీన్ యాక్ట్ చేసి చూపించేవాడు.  నిజానికి ఈ సినిమాను 'ఈ నగరానికి ఏమైంది' కంటే ముందే మొదలు పెడదామని అనుకున్నా. యాక్టర్ల కోసం చూసే సమయంలో తరుణ్ ఈ పాత్రకు సరిపోతాడు కదా అనిపించింది. తరుణ్ ను చాలా రిక్వెస్ట్ చేసి ఒప్పించాల్సి వచ్చింది.  ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ తరుణ్ భాయ్" అన్నాడు.

"డైరెక్టర్.. ప్రొడ్యూసర్.. హీరో మూడు మీరే. ఎలా చేశారు?" అని అడిగితే "అది వినడానికి కొంచెం చిరాకుగా ఉంటుంది.  సినిమా అవుట్ పుట్ బాగుంటే 'బాగా చేశాడు' అంటారు. లేకపోతే 'బలిసి చేశాడు రా వీడు' అంటారు.  అది మైండ్ లో పెట్టుకునే సినిమా చేశాను. సినిమా ఒకవేళ అటూ ఇటూ అయితే నేను ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడి కూడా వేస్ట్ అవుతుంది.  నేను అన్నిటికీ రెడీ గా ఉన్నా" అన్నాడు.  

విష్వక్ సేన్ మాట తీరు.. ఆ కాన్ఫిడెన్స్ చూస్తుంటే 'అర్జున్ రెడ్డి' ప్రమోషన్స్ సమయంలో విజయ్ దేవరకొండ మాట్లాడిన స్పీచ్ లు గుర్తొస్తున్నాయి. కొందరు విష్వక్ సేన్ ఇలా మాట్లాడడం పై విమర్శలు చేయడం మొదలు పెట్టారు.  'ఫలక్ నుమా దాస్' ప్రమోషన్స్ కోసం విజయ్ దేవరకొండను ఫాలో అవుతున్నాడని అంటున్నారు.  మరి విజయ్ లా విజయం సాధిస్తాడా లేదా అనేది సినిమా రిలీజ్ అయితే కానీ మనకు తెలియదు.
Tags:    

Similar News