మలయాళ విలక్షణ నటుడు కళాభవన్ మణి చనిపోయి ఏడాది దాటిపోయింది. ఇప్పటిదాకా ఆయన మరణం తాలూకు మిస్టరీ ఏంటన్నది తేలలేదు. ఇంత కాలం తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ కేరళ హైకోర్టు నిర్ణయం తీసుకోవడం సంచలనం రేపుతోంది. దీన్ని బట్టి మణి మృతి విషయంలో పెద్ద మిస్టరీనే దాగి ఉందని తెలుస్తోంది. ఇలా ఓ నటుడి మృతికి సంబంధించిన కేసును సీబీఐ టేకప్ చేయడం అరుదే. మరి కళాభవన్ మణి చనిపోయిన ఏడాది తర్వాత విచారణ మొదలుపెడుతున్న సీబీఐ కొత్తగా ఏం పరిశీలన జరుపుతుందో.. ఈ కేసు విషయంలో ఏం తేలుస్తుందో చూడాలి.
నాటక రంగంలో గొప్ప పేరు సంపాదించి.. ఆ తర్వాత సినీరంగ ప్రవేశం చేసి ఇక్కడా తనదైన ముద్ర వేశాడు కళాభవన్ మణి. ‘శీను వాసంతి లక్ష్మి’ ఒరిజినల్ వెర్షన్లో అతనే హీరో. ఆ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత తమిళ ‘జెమిని’ సినిమాతో అతడి పేరు మార్మోగిపోయింది. ఆ సినిమా తెలుగు రీమేక్ తో ఇక్కడి ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాడు. తర్వాత ‘అర్జున్’ లాంటి మరికొన్ని సినిమాల్లోనూ నటించాడు. మలయాళ సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో హఠాత్తుగా అతను చనిపోవడం సంచలనం సృష్టించింది. అనారోగ్యంతోనే అతను చనిపోయాడని అంతా అనుకున్నారు కానీ.. విష ప్రయోగం వల్లే చనిపోయాడన్న అనుమాలు అందరినీ విస్మయానికి గురి చేశాయి. కానీ విచారణ సందర్భంగా అనుమానితులుగా కూడా ఎవ్వరూ బయటపడలేదు. మరి సీబీఐ ఈ కేసును ఏం చేస్తుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/