టాలీవుడ్ లో పరిచయం చేయాల్సిన అవసరం లేని కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ రాహుల్ రామకృష్ణ. టాలెంట్ కు ఏ మాత్రం కొదవ లేని ఈ నటుడు.. తక్కువ వ్యవధిలోనే టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. ప్రతి పది.. పదిహేనేళ్లకు ఒకసారి కొత్త నీరు ఇండస్ట్రీలోకి వస్తుందని చెబుతారు. ఆ కోవలోకే వస్తాడు రాహుల్ రామకృష్ణ. విన్నంతనే కాస్తంత భిన్నంగా ఉండే అతగాడి పేరు వెనకున్న రహస్యాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు.
తన తల్లిదండ్రులది పెద్దల కుదిర్చిన పెళ్లి అని.. వాళ్లిద్దరు ఏ విషయాన్ని ఒక పట్టాన ఒప్పుకునేవారు కాదని.. తన తండ్రికి రాహుల్ అన్న పేరు ఇష్టమని.. తన తల్లికి రామకృష్ణ అని పేరు పెట్టాలని బలంగా అనుకున్నదని.. దీంతో ఇద్దరు కలిసి ఫైనల్ చేసిన పేరు రాహుల్ రామకృష్ణగా చెప్పారు.
ఇద్దరు కలిసి ఉండాలంటే అండర్ స్టాండింగ్ ముఖ్యమని.. అందుకే తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. మొత్తానికి అరేంజ్ మ్యారేజ్ అంతే అంత ఇష్టం లేదన్న విషయాన్ని తన మాటలతో చెప్పేశాడు.
తమ పక్క వీధిలో ఉండే అమ్మాయిని చూసి తాను మనసు పారేసుకున్నానని.. ఇద్దరి ఆసక్తులు కలవటంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన పేరు నాగ హరిత అని.. వాళ్లది వైజాగ్ అని చెప్పుకొచ్చాడు. తన గడ్డం గురించి అందరూ అడుగుతుంటారని.. దానికో కథ ఉందని చెబుతూ.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
తనకు భరత్ అనే నేను సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు కొరటాల గడ్డం పెంచాలన్నారని.. అప్పుడే రాజమౌళిగారు పిలిచి.. గడ్డాన్ని ఇలా కాదు ఇలా పెంచాలని చెబుతూ.. మరికాస్త పెంచమన్నారన్నారు.
అలా పెంచుకుంటూ పోయానని.. కరోనా టైంలో కంటిన్యూ అయిన గడ్డం.. ఏడాదిన్నర తర్వాత షూటింగ్ కు వెళితే.. అదే గడ్డాన్ని కంటిన్యూ చేయమన్నారన్నారు.అలా గడ్డం.. ఇప్పుడు ఇలా ఇక్కడి వరకు వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. గడ్డం గురించి మరో ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. "గడ్డం మీద తాను చాలా ఖర్చు చేశా. దానికి చాలా కేర్ అవసరం. ట్రీట్ మెంట్లు.. మొయింటెన్స్ కోసం చాలానే ఖర్చు చేశా. సినిమాల కోసం గడ్డం కాబట్టి స్క్రీన్ లో రిచ్ లుక్ కనిపించటం కోసం ఖర్చు అవుతుంది మరి' అంటూ తనదైన ఫ్లోలో చెప్పుకొచ్చాడు. మొత్తానికి తన పేరు వెనకున్న సీక్రెట్.. తన గడ్డం కథను జనరంజకంగా చెప్పుకొచ్చాడు ఇంటర్వ్యూలో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.