జీ గ్రూప్ కు చెందిన 'జీ 5' ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్.. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ.. వంటి పలు భారతీయ భాషల్లో కంటెంట్ ని వీక్షకులకు అందిస్తోంది. ఈ క్రమంలో జీ5 ఓటీటీ ఉండగా.. వినోదానికి లోటు ఉండదనే పేరు తెచ్చుకుంటోంది. వివిధ జానర్లలో ఎప్పటికప్పుడు సరికొత్త వెబ్ సిరీస్ లు.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ లతో పాటు కొత్త సినిమాలను స్ట్రీమింగ్ పెడుతున్నారు. అయితే గత కొంతకాలంగా జీ ఓటీటీ తెలుగు కంటెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అర్థం అవుతోంది.
తెలుగులో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ విధానంలో వచ్చిన ఫస్ట్ సినిమా 'అమృత రామమ్' జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరికొన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజులతో పాటుగా థియేటర్లలో విడుదలైన హిట్ సినిమాలను సైతం వీక్షకులకు అందిస్తోంది. ఇటీవల వచ్చిన 'నెట్' 'అలాంటి సిత్రాలు' వంటి మూవీస్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో దసరా పండుగ సందర్భంగా వచ్చిన శ్రీవిష్ణు 'రాజ రాజ చోర' సినిమా కూడా అలరిస్తోంది. థియేటర్ లో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఓటీటీలో కూడా ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది. ఇక దీపావళి కానుకగా సుధీర్ బాబు హిట్ సినిమా 'శ్రీదేవి సోడా సెంటర్' విడుదల చేయడానికి రెడీ అయ్యింది.
ఇప్పుడు లేటెస్టుగా ''హెడ్స్ అండ్ టేల్స్'' అనే సరికొత్త వెబ్ మూవీని జీ5 ఓటీటీ తీసుకొచ్చింది. ఇందులో సునీల్ - సుహాష్ - చాందిని రావు - దివ్య శ్రీపాద - శ్రీ విద్య మహర్షిని ప్రధాన పాత్రలు పోషించారు. 'కలర్ ఫొటో' దర్శకుడు సందీప్ రాజ్ దీనికి కథ అందించగా.. నటుడు సాయి కృష్ణ ఎన్రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'కలర్ ఫోటో' కోర్ టీమ్ కలిసి వర్క్ చేసిన ఈ మూవీ వీక్షకులను అలరిస్తోంది. స్లో నెరేషన్ అయినప్పటికీ.. స్వీట్ అండ్ సింపుల్ మూవీని చూసిన అనుభూతిని కలిగిస్తుంది.
అలివేలు మంగ(దివ్య శ్రీపాద) - శృతి(చండి రావు) - అనీషా(శ్రీ దివ్య) అనే ముగ్గురు మహిళల సంక్లిష్ట జీవితాన్ని 'హెడ్స్ అండ్ టేల్స్' సినిమాలో చూపించారు. ఇందులో సునీల్ పాత్ర ఆసక్తికరం. అప్ కమింగ్ యాక్ట్రెస్ గా శ్రీ విద్య.. పోలీస్ కానిస్టేబుల్ గా దివ్య దృష్టి.. ఒక వ్యక్తితో రొమాంటిక్ రిలేషన్ షిప్ లో ఉన్న అమ్మాయిగా చాందిని రావు కనిపించారు. ఈ ముగ్గురి జీవితాల్లో మూడు భిన్నమైన సమస్యలు ఉండగా.. వాటిని ఎలా ఎదుర్కొన్నారు? ఒక్క రోజు రాత్రి ముగ్గురూ కలిసి వాటి నుంచి ఎలా బయట పడ్డారు? అనేది ఈ చిత్రంలో చూపించారు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ప్రతి మహిళకూ స్ఫూర్తినిచ్చేలా.. వారి హక్కుల కోసం పోరాడాలనే సందేశం ఇస్తుంది.
SKN సమర్పించిన 'హెడ్స్ అండ్ టేల్స్' సినిమా రమ్య క్రియేషన్స్ - పాకెట్ మనీ పిక్చర్స్ బ్యానర్స్ మీద రూపొందించారు. ప్రదీప్ - రమ్య చౌదరి నిర్మాతలుగా వ్యవహరించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ మూవీకి సంగీతం సమకూర్చారు. వెంకట్ ఆర్.శాఖమురి సినిమాటోగ్రఫీ అందించగా.. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఏదేమైనా జీ5 ఓటీటీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ని అందిస్తూ తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోందని చెప్పవచ్చు.