‘వకీల్ సాబ్’ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ గా వచ్చిన ‘మగువా మగువా’ సాంగ్ ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. గతేడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పాట.. అందరి మనసులనూ కదిలించింది. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను, చేస్తున్న త్యాగాలను కళ్లకు కట్టిందీ పాట.
ఆడియోగా, లిరికల్ సాంగ్ గా అలరించిన ఈ పాటను.. తెరపై కూడా అద్భుతంగా ఆవిష్కరించారు దర్శకుడు వేణు శ్రీరామ్. ఈ ఒక్క పాట ద్వారా మహిళల్లోని విభిన్న పార్శ్వాలను ఆవిష్కరించారు. ఈ పాటను ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ మరింత హృద్యంగా ఆలపించి, ప్రాణం పోశారు.
అయితే.. సినిమాలోని సెకండ్ హాఫ్ లో ఇదే సాంగ్ ను లేడీ వర్షన్ లో ఉంచారు. లిరిక్స్ మొత్తం మార్చేసి, లేడీ సింగర్ తో పాడించారు. అన్యాయమైన కేసు వెన్నాడుతున్న వేళ.. యువతులు అనుభవిస్తున్న నరకయాతనను ప్రతిబింబిస్తూ వచ్చిన ఈ పాట.. ప్రేక్షకుల గుండెలను పిండేస్తోంది.
ఈ పాటకు సంబంధించిన లిరిక్స్ ను రచయి రామజోగయ్య శాస్త్రి నిన్న రాత్రి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. సినిమా చూసిన వారు.. సెకండ్ వర్షన్ విన్నవారంతా.. మొదటి వర్షన్ ను మించి ఉందని అభినందిస్తున్నారు.