మంచి సినిమా..హిట్ టాక్..అయినా ఫ్లాపే

Update: 2015-11-18 09:30 GMT
కమల్ హాసన్ సినిమాలకు ఇది మామూలే. ఆయన సినిమాలకు చాలా మంచి టాక్ వస్తుంది. కానీ కలెక్షన్లు మాత్రం అనుకున్న స్థాయిలో రావు. కొన్నిసార్లు వివాదాలు ఆయన్ని దెబ్బ కొడుతుంటాయి. కొన్నిసార్లు ప్రేక్షకులే సరిగా సినిమాను రిసీవ్ చేసుకోరు. ఇంకొన్నిసార్లు ఇంకేదో వివాదం ఇబ్బంది పెడుతుంది. ‘విశ్వరూపం’ సినిమా ఎన్ని ప్రశంసలు వచ్చినప్పటికీ.. తమిళనాట ఐదారు రోజులు లేటుగా విడుదల కావడం వల్ల చాలానే నష్టం వాటిల్లింది ఆ సినిమాకు.

ఇక ఏ ఏడాది వేసవికి వచ్చిన ‘ఉత్తమ విలన్’ సంగతి తెలిసిందే. ఆ సినిమాకు కూడా మంచి టాక్ వచ్చినా లాభం లేకపోయింది. నిర్మాత లింగుస్వామికి - బయ్యర్లకు మధ్య గొడవ వల్ల రెండు రోజులు లేటుగా రిలీజైంది మూవీ. దీంతో వీకెండ్ అడ్వాంటేజీ మిస్ అయి ఓపెనింగ్స్ కు బాగా దెబ్బ పడింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘పాపనాశం’ కూడా అద్భుతం అన్నారు. కానీ ఈ సినిమాను పైరసీ పెద్ద దెబ్బే కొట్టింది. ఈ మూడు సినిమాలు కూడా టాక్ కు తగ్గ కలెక్షన్లు రాబట్టలేదు.

ఇప్పుడు ‘తూంగావనం’ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. చాలా మంచి టాక్‌ తో మొదలైంది ఈ సినిమా. కానీ ఏం లాభం? భారీ వర్షాలు తమిళనాడును ముంచెత్తడంలో కలెక్షన్లు లేవు. అసలే ఇది ఎ-క్లాస్ ఆడియన్స్ కు నచ్చే సినిమా. మాస్‌ లో పెద్దగా ఆదరణ లేదు. మామూలుగానే కలెక్షన్లు తక్కువగా ఉన్నాయి. దీనికి తోడు వర్షాల ప్రభావంతో థియేటర్లు నిండట్లేదు. దీంతో బయ్యర్లకు నష్టం తప్పేలా లేదు.
Tags:    

Similar News