తెలుగు సినిమాల్లో మూసధోరణి కథలు, కథనాలు చాలా వేగంగా కనుమరుగు అవుతున్నాయి. నాలుగు ఫైట్లు, ఆరు పాటల కాన్సెప్ట్ పక్కకు పోయి చాలా కాలమైంది. ఇండస్ట్రీలోకి నవ దర్శకుల రూపంలో కొత్త నీరు వస్తుండడంతో సరికొత్త ఆలోచనలు ప్రాణం పోసుకుంటున్నాయి. వెండి తెరపై ప్రయోగాలు పెరిగిపోయాయి. ఈ మార్పు కారణంగానే సరికొత్త కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు ఆవిష్కృతమవుతున్నాయి.
తాజాగా విప్లవ్ కోనేటి అనే దర్శకుడు 'తెలిసిన వాళ్లు' అనే టైటిల్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని పట్టాలెక్కించాడు. లేడీ ఓరియంటెడ్ గా సాగిపోయేలా కనిపిస్తున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. అయితే.. తాజాగా రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ పోస్టర్లో పాత తరానికి చెందిన కుర్చీలో చుడీదార్ డ్రెస్ లో కూర్చుంది హెబ్బా. కానీ.. ఆమె బాడీకి తల లేదు. ఆ తల గోడకు వేళాడుతున్న ఫొటో ఫ్రేమ్ లో ఉంది. అంటే.. తెలిసిన వాళ్ల ద్వారా మోసపోయిన ఓ అమ్మాయి కథతో ఈ సినిమా తెరకెక్కున్నట్టు కనిపిస్తోంది. సిరంజ్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇదేకాకుండా.. 'ఓదెల రైల్వే స్టేషన్' అనే మరో సినిమాలోనూ నటిస్తోంది హెబ్బా. ఇందులో డీగ్లామరస్ హీరోయిన్ గా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. మొత్తానికి.. ఇన్నాళ్లూ గ్లామరస్ పాత్రలకే పరిమితమైన హెబ్బా పటేల్.. క్రమంగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటిస్తోంది. మరి, ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి.