అఖిల్ సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ అందుకున్న అక్కినేని అఖిల్ మొత్తానికి సెకండ్ సినిమాతో పాజిటివ్ టాక్ ను అందుకున్నాడు. అయితే టాక్ అయితే బాగానే ఉంది గాని కలెక్షన్స్ సంగతి ఏంటి మరి. సినిమా అయితే మొత్తానికి మంచి రేట్ కే అమ్ముడు పోయింది. వరల్డ్ వైడ్ మొత్తంగా హలో థ్రియేటికల్ రైట్స్ రూ.32 కోట్లకు అమ్మడు పోయాయి. సినిమా రిలీజ్ కూడా భారీ స్థాయిలో జరిగింది.
ఇక మొదటి ఏడు రోజుల కలెక్షన్స్ షేర్స్ విషయానికి వస్తే.. టోటల్ గా రూ.15.7 కోట్లు వచ్చాయి. నైజాం ఏపీ లోనే సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. అక్కడ రూ.11 కోట్ల వరకు అఖిల్ రాబట్టాడు. ఇక మిగతా ఏరియాల్లో మాత్రం ఎదో నామమాత్రంగానే అలా అలా వచ్చాయి. అయితే అఖిల్ ప్రమోషన్స్ బాగానే చేశాడని చెప్పాలి. అందువల్ల ఈ స్థాయి వరకైనా కలెక్షన్స్ వచ్చాయి. ఓపెనింగ్స్ అనుకున్నంత లెవెల్లో రాలేకపోయాయి.
ఇక సినిమా ప్రస్తుత షేర్ కలెక్షన్స్ ని బట్టి చూస్తే ఇంకా 16 కోట్ల వరకు రాబట్టాలి. అప్పుడే కలెక్షన్స్ పరంగా నిజమైన హిట్ అందుకున్నట్లు. కాని వారం గడిచిపోయినా ఇంకా సగంలోనే ఉండడం చూస్తుంటే సినిమా టార్గెట్ ను రీచ్ అవుతుందా అనేది సందేహంగా ఉంది. ఈ వీకెండ్ లో ఏమైనా కలెక్షన్స్ పెరగవచ్చు. నెక్స్ట్ వీక్ లో కూడా అఖిల్ కు పెద్ద సినిమాలు ఏమి పోటీ రాలేవు. మరి హలో ఎంతవరకు రాబడుతుందో.. సగం వరకు కొట్టిన ఈతను ఒడ్డు వరకు ఎలా తీసుకెళుతుందో చూడాలి.