హేమమాలిని సంచలన వ్యాఖ్యలు

Update: 2017-05-20 06:25 GMT
హేమమాలినికి డ్రీమ్ గర్ల్ అన్న పేరు ఊరికే రాలేదు. అప్పట్లో దేశంలోని కోట్లాది మంది కుర్రాళ్లకు ఆమె కలల రాణి. తన అందచందాలతో భారీగా అభిమానగణాన్ని సంపాదించుకుంది హేమమాలిని. ఐతే ఓ హీరోయిన్ తన అందంతో ఎంతగా మురిపించినా.. కొన్నేళ్లు గడిచాక ఫేడవుట్ కావాల్సిందే. వయసు మీద పడి అందం తగ్గగానే తిరస్కారం తప్పదు. హీరోల్లాగా దశాబ్దాల పాటు సినిమాల్లో కొనసాగడం హీరోయిన్లకు సాధ్యం కాదు. ఈ విషయం మీదే అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది హేమమాలిని. మిడిలేజ్డ్ హీరోయిన్లకు వాళ్ల వయసుకు తగ్గ పాత్రలు ఎందుకు ఇవ్వరంటూ ఆమె ప్రశ్నించింది.

‘‘ఈ రోజుల్లో నా వయస్సున్న హీరోయిన్లతో బాలివుడ్లో ఎవరూ సినిమాలు తీయాలనుకోవడం లేదు. ఇప్పటికీ మేం సినిమాను మా భుజాలపై సులభంగా మోయగలం. పాత తరానికి చెందిన మాకు సినిమాను నడిపించగలం అనే నమ్మకం ఉన్నప్పుడు.. మాలాంటి వాళ్లను బాలివుడ్‌ దర్శకులు ఎందుకు తీసుకోవడం లేదు. వయసు మళ్లిన తారల్ని చూడటం ప్రేక్షకులకు ఇష్టం లేదా.. లేక దర్శక నిర్మాతలకే మమ్మల్ని తీసుకోవడం ఇష్టం లేదా?’’ అని హేమమాలిని ప్రశ్నించింది. ఇటీవల సినీ పరిశ్రమలో వినిపిస్తున్న కథనాలే వయసు మళ్లి తారల్ని తీసుకోకపోవడానికి కారణమా అంటూ మరో ప్రశ్న కూడా వేసింది హేమమాలిని. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి గత కొంత కాలంగా పెద్ద చర్చే నడుస్తోంది. పడగ్గదికి వస్తే తప్ప అవకాశాలు ఇవ్వబోమంటూ దర్శక నిర్మాతలు తమను లొంగదీసుకునే ప్రయత్నం చేశారంటూ ఇటీవల చాలామంది హీరోయిన్లు ఆరోపించారు. హేమమాలిని దీన్ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News