పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్టే అయినా.. హేమకు ఉన్న క్రేజే వేరు. చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్నా.. హేమ అందరిలోకి ప్రత్యేకం. ఆమెను అభిమానించే వారిలో క్లాస్.. మాస్ అందరూ ఉంటారు. ఆమెలో అందరిని ఆకర్షించేది గలగలా మాట్లాడే తత్వం. చురుగ్గా ఉంటూ.. సందడిగా వ్యవహరించే బిహేవియరే. హేమను హేమగా చూసే వాళ్లు కొందరైతే.. హేమ ఆంటీగా అప్యాయంగా పిలుచుకునే వారూ ఉన్నారు. తాజాగా హేమ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమె తెలుసుకున్న లైఫ్ పాఠాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
హేమ పెళ్లి ఎలా జరిగింది?
చాలా చిన్న వయసులోనే ఆమె పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అందుకు కారణం ఏమిటి? జీవితంలో తాను చాలానే లవ్ స్టోరీలు చూశానని.. అవంటే తనకు పడవన్నట్లుగా మాటలు చెప్పే హేమ.. ఎవరికి చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమిటన్నది ఆమె మాటల్లోనే చూస్తే..
ఎవడైనా వచ్చి నన్ను ప్రేమిస్తావా? అని అడుగుతుంటారు. కానీ.. జాన్ మాత్రం అందుకు భిన్నం. నేరుగా నా దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుంటావా? అని అడిగేశాడు. అలా అడిగిన తీరు నచ్చింది. అందరూ ప్రేమించమని అడుగుతుంటే.. అతడు మాత్రం అందుకు భిన్నంగా పెళ్లి విషయం డైరెక్ట్ గా అడిగేయటంతో ఎవరికి చెప్పకుండానే పెళ్లి చేసేసుకున్నామని హేమ చెప్పుకొచ్చింది.
నా పెళ్లి జరిగిన విషయం మా ఇంట్లో తెలిసి పెద్ద గొడవలే జరిగాయి. జాన్ నాన్నగారు ఒకప్పటి కెమేరామన్ ఎస్ డి లాల్. మా పెళ్లి అయ్యే నాటికే ఆయన చనిపోయారు. పెళ్లి తర్వాత మా బావ గారు నన్ను సినిమాల్లో యాక్ట్ చేయొద్దన్నారు. దీంతో.. ఏడేళ్లు గ్యాప్ వచ్చింది. అందుకే.. సినిమాకు అప్పట్లో దూరమయ్యానంటూ చెప్పుకొచ్చారు హేమ ఆంటీ.
ఆమె తెలుసుకున్న లైఫ్ పాఠాలు చూద్దామా?
= ఎవడైనా మనతో మాట్లాడితే డబ్బు కోసం మాట్లాడతాడు. లేకపోతే చీట్ చేయటానికి మాట్లాడతాడు. మనని మన కోస ఇష్టపడేవాల్లు అతి తక్కువ మంది ఉంటారు. ఈ విషయంలో నాకు మొదట్లోనే తెలిసింది.
= నా చుట్టూ ఉన్న వారిలో కొంతమంది అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారు. వీళ్ల సంపాదనంతా బాయ్ ఫ్రెండ్స్ ఖర్చు చేసేసేవారు. ఆ బాయ్ ఫ్రెండ్ కి అప్పటికే పెళ్లి అయితే.. అదో గొడవ.
= మొదటి భార్యతో దెబ్బలాటలు.. తన్నులు. వాడు వెళ్లిపోయాడని తాగుడు. ఇలా జీవితాలను నాశనం చేసుకున్న వాళ్లను చూశా. అందుకే ఎప్పుడూ తాగకూడదనుకున్నా. పెళ్లైన వాడికి రెండో భార్యగా ఉండకూడదనుకున్నా. అందుకే చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని.
= అన్ని విషయాలకూ అబ్బాయిదే తప్పు అని చెప్పను. ప్రతి వ్యక్తికి కొన్ని వీక్ నెస్ లు ఉంటాయి. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఓదారిస్తే.. అబ్బా వీడు నా గురించి పట్టించుకుంటున్నాడంటే.. నేనంటే ఎంతో ఇష్టమని అని అనుకుంటారు. ఆ ఫీలింగే వాళ్లను ఊబిలోకి ఈడుస్తుంది.
= నాకు తెలిసినంతవరకూ.. తన స్వార్థం కోసం ఏ అమ్మాయి తప్పు చేయదు. ఒకవేళ ఎవరైనా అమ్మాయి ఏదైనా తప్పు చేస్తుందంటే.. ఆ అమ్మాయి సంపాదన మీద తినేవాళ్లు ఉన్నారనే అర్థం.
= చుట్టూ ఉన్న పరిస్థితుల మీద అవగాహనతో ఎవరికి అనవసరపు చనువు ఇచ్చేదాన్ని కాదు. ఇప్పటికి అందరితో నవ్వుతూ మాట్లాడినా.. ఎవరినీ నెత్తికి ఎక్కించుకోను. నేను నేర్చుకున్న జీవిత పాఠమిది.