'స్వప్న సంచారి' అనే మలయాళి చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అను ఎమాన్యూల్ తెలుగు ప్రేక్షకులకు 2016లో మజ్ను చిత్రంతో పరిచయం అయ్యింది. నాని హీరోగా నటించిన ఆ సినిమాతో అనుకు మంచి గుర్తింపే దక్కింది. ఆ సినిమా తర్వాత తెలుగు మరియు తమిళంలో బిజీ అయ్యింది. ఎంతో మంది హీరోయిన్స్ వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అవుతారు. సరైన గైడెన్స్ లేని కారణంగా హీరోయిన్స్ కెరీర్ కొంత కాలంకే ముగుస్తుంది.
అను ఎమాన్యూల్ పరిస్థితి కూడా అలాగే అయ్యింది. కెరీర్ ఆరంభంలో ఆమె తీసుకున్న నిర్ణయాల వల్ల కెరీర్ కు దెబ్బ పడింది. పాత్రల గురించి పట్టించుకోకుండా సినిమాలకు కమిట్ అవ్వడం వల్లే తనకు ఇప్పుడు ఆఫర్లు రావడం లేదు అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అను ఎమాన్యూల్ చెప్పుకొచ్చింది. సినిమాల ఎంపిక విషయంలో నాకు నేనుగా నిర్ణయాలు తీసుకోవడం అవి చెడు ఫలితాన్ని ఇవ్వడం వల్ల పెద్ద ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ తో 'అజ్ఞాతవాసి' మరియు అల్లు అర్జున్ తో 'నాపేరు సూర్య' చిత్రాలు చేయకుండా ఉండి ఉంటే ఈమె కెరీర్ ప్రస్తుతం మరోలా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమాలు చేయకుండా ఉంటే చిన్న సినిమాల్లో ఇంకా హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చేదని మంచి హిట్ పడ్డప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకునేది అంటూ విశ్లేషిస్తున్నారు. మరి కొందరు మాత్రం ఆ రెండు సినిమాలు హిట్ అయితే అనూ స్టార్ హీరోయిన్ అయ్యేదంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి ఆ రెండు మెగా మూవీస్ అను ఎమాన్యూల్ కెరీర్ ను పూర్తిగా టర్న్ చేశాయి. ప్రస్తుతం తమిళంలో ఒక చిన్న సినిమా మినహా మరేం సినిమాల్లో నటించడం లేదట. తెలుగులో ఆఫర్ల కోసం ఉన్న పరిచయాలతో ప్రయత్నాలు చేస్తుందని సమాచారం అందుతోంది. మరోసారి ఛాన్స్ వస్తే గతంలో జరిగిన తప్పులను పునరావృతం కానివ్వనంటూ సన్నిహితుల వద్ద చెబుతోందట.