బిగ్ బాస్ హౌస్ లో ఆమె ఒంటరి పోరాటం..!

Update: 2022-11-03 08:30 GMT
బిగ్ బాస్ సీజన్ 6 TRP పెంచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు బిగ్ బాస్ టీం. అంతకుముందు సీజన్లైనా కాస్త కూస్తో బెటర్ కానీ సీజన్ 6 మాత్రం ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. అయినా సరే హౌస్ మెట్స్ కి ఏదో ఒక కంటెంట్ ఇస్తూ అలా నెట్టుకొస్తున్నారు. 9 వారాలు పూర్తి చేసుకుని 10వ వారం నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 లో ఇప్పటివరకు ఏ ఒక్కరు టైటిల్ విన్నర్ అర్హత సంపాదించలేదని చెప్పాలి. అయితే ఉన్న వారిలో బయట క్రేజ్ ఉన్న రేవంత్ ఒక్కడే అత్యధిక ఓట్లతో ముందున్నాడు. రేవంత్ కి సీజన్ 6 లో గెలవాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి కానీ అతని మాటల వల్ల అతన్ని టైటిల్ కి దూరం చేసే ఛాన్స్ ఉంది.

ఇక రేవంత్ తర్వాత హౌస్ లో అందరితో ఫైట్ కి దిగుతూ తన వాయిస్ వినిపిస్తుంది ఇనయా సుల్తానా. బిగ్ బాస్ హౌస్ లో ఆమె స్ట్రాటజీ ఏంటన్నది ఇప్పటివరకు ఎవరికి అర్ధం కావట్లేదు. ఏదో ఒక విషయానికి గొడవ పడుతూ కంటెంట్ ఇస్తూ వచ్చిన ఇనయా రెండో వారం తర్వాత సూర్యకి దగ్గరై తన ఆట తీరు మార్చేసింది.

అయితే సూర్యని ఇష్టపడుతూ అతన్నే నామినేట్ చేసి హౌస్ లోంచి వెళ్లేలా చేసింది ఇనయా. అదే ఆమెకు ఇప్పుడు మైనస్ గా మారింది. సూర్య అంటే ఇష్టం అంటూ సూర్య కప్ లో పాలు.. సూర్య తిన్న ప్లే లో లంచ్ చేస్తూ అతి చేస్తున్న ఇనయా అతన్ని నామినేట్ చేసి వెళ్లిపోయేలా చేయడం ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. అంతేకాదు సూర్యని నామినేట్ చేసిన రోజే రేవంత్ తో మాట్లాడుతూ సూర్య వెళ్లాలనే నామినేట్ చేసినట్టు చెప్పింది.

ఓ పక్క అతనంటే ఇష్టమంటూ సూర్య వెళ్లడానికి కారణమైన ఇనయాలోని ఈ రకరకాల షేడ్స్ ఆడియన్స్ భరించలేకపోతున్నారు. సూర్యకి వెన్నుపోటు పొడించిందని హౌస్ మెట్స్ అంతా కూడా ఇనయా మీద ఎటాక్ కి దిగుతున్నారు. మరీ ముఖ్యంగా టాస్కుల్లో ఇనయా నే వారి ఫస్ట్ టార్గెట్ అవుతుంది.

గ్రూపులుగా ఆడుతున్నా అందరి ఫోకస్ ఇనయా మీదే ఉంది. ఈ క్రమంలో హౌస్ లో ఇనయా ఒంటరిపోరాటం చేస్తుందని చెప్పొచ్చు. ఇనయా సూర్యని ఇష్టపడటంలో తప్పులేదు కానీ అతన్ని నామినేట్ చేయడంలో కూడా ఆటలో స్ట్రాటజీ అనుకున్నా మళ్లీ రేవంత్ తో సూర్య వెళ్లడం గురించి మాట్లాడటం ఆమెని బ్యాడ్ అయ్యేలా చేసింది.

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరైన దగ్గర నుంచి మళ్లీ ఎలిమినేట్ అయ్యి హౌస్ బయటకు వచ్చే వరకు ఒక్కొక్కరు ఒక్కో తమ గేమ్ స్ట్రాటజీ ఉపయోగిస్తారు. మరి ఇనయా తన ఆట తీరు ఏంటన్నది తనకైనా అర్ధం అవుతుందా లేక ఏదో ఫ్లోలో అలా చేసుకుంటూ వెళ్తుందా అన్నది తెలియాల్సి ఉంది. సూర్య ఎలిమినేషన్ కి ఇనయా కారణం అని తెలిసినప్పటి నుంచి ఆమెని డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా హౌస్ మెట్స్ టార్గెట్ చేస్తున్నారు. ఆడియన్స్ కూడా ఇనయా ఆడుతున్న డబుల్ గేమ్ ని కనిపెట్టేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News