'బాహుబలి' ప్రాంచైజీ తర్వాత దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా "ఆర్.ఆర్.ఆర్". జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫిక్షన్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. థియేట్రికల్ రిలీజ్ లో భారీ వసూళ్లను సాధించిన ఈ మల్టీస్టారర్.. ఓటీటీలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది.
సాధారణ ప్రేక్షకులే కాదు హాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ చిత్రాన్ని కొనియాడారు. ఈ క్రమంలో RRR సినిమా ఇటీవల జపాన్ లో విడుదల చేసారు. అయితే అక్కడ కూడా ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 'బాహుబలి 2' రికార్డ్స్ ను అందుకునే లక్ష్యంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడిన జక్కన్న.. 'ట్రిపుల్ ఆర్' విజయానికి కారణాలను వివరించారు. యాక్షన్ సన్నివేశాలు మరియు హీరోయిజమే ఈ సినిమా సక్సెస్ కు కారణమని పేర్కొన్నారు.
రాజమౌళి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇండియన్స్ ఉన్నారు. భారతీయులు ఎక్కడ ఉన్నా మా చిత్రాన్ని ఆదరిస్తారని భావించారని అన్నారు. కానీ, వెస్టర్న్ ఆడియన్స్ కూడా ఈ సినిమాపై ఎంతో అభిమానం చూపిస్తున్నారని.. ఇది తాను ఊహించలేదని దర్శకుడు తెలిపారు. RRR చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు - ఎమోషన్స్ మరియు అద్భుతమైన హీరోయిజం వల్లే గొప్ప విజయం సాధించిందని నేను నమ్ముతున్నానని రాజమౌళి చెప్పుకొచ్చారు.
కాగా, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన 'ఆర్.ఆర్.ఆర్'.. అవార్డ్స్ లోనూ సత్తా చాటుతోంది. లేటెస్టుగా బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీగా ప్రతిష్టాత్మక శాటర్న్ అవార్డును దక్కించుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 'బాహుబలి 2' తరవాత ఇది రాజమౌళి అందుకున్న రెండో శాటర్న్ అవార్డ్ అని తెలుస్తోంది.
ఇక ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలోనూ 'ఆర్.ఆర్.ఆర్' సినిమా నిలవనుంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాత్రం మన దేశం తరపున అకాడమీ అవార్డ్స్ పరిశీలనకు అఫిషియల్ ఎంట్రీగా ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని ఎంపిక చేయనప్పటికీ.. ఫర్ యువర్ కన్సిడరేషన్ (FYC) కింద మేకర్స్ అకాడెమీ జ్యూరీ పరిశీలనకు పంపించారు. బెస్ట్ మోషన్ పిక్చర్ - డైరెక్టర్ - యాక్టర్ - ఒరిజినల్ స్క్రీన్ ప్లే - ఒరిజినల్ స్కోర్ - ఒరిజినల్ సాంగ్.. ఇలా మొత్తం 15 క్యాటగిరీలలో నామినేషన్స్ కోసం క్యాంపెయిన్ చేస్తున్నారు.
RRR (రౌద్రం రణం రుధిరం) చిత్రాన్ని 1920స్ బ్యాక్ డ్రాప్ లో విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా అల్లుకున్న కల్పిత కథతో తెరకెక్కించారు. దీనికి ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించారు. రామరాజుగా చరణ్.. భీం గా తారక్ అద్భుతమైన నటన కనబరిచారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. డీవీవీ దానయ్య ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.