ఫిలిం చాంబర్ దగ్గర హీరో ధర్నా

Update: 2016-07-09 09:45 GMT
ఇదేదో సినిమా షూటింగ్ కాదండి. నిజంగానే హీరో ఆదిత్య ఓం ఇవాళ ఫిలిం ఛాంబర్ దగ్గర ధర్నా మొదలెట్టాడు. తన సమస్యలు తీరేవరకు ఫిలిం ఛాంబర్‌ దగ్గర ధర్నా కొనసాగిస్తాను అంటున్నాడు. పదండి చూద్దాం అసలు విషయం ఏంటో.

అప్పుడెప్పుడో 2002లో లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య ఓం ఉన్నాడు చూడండి.. ఆ తరువాత ఒక రెండు డజన్లు సినిమాలు చేసి ఫేడవుట్‌ అయ్యాడు. ఇప్పుడు ఫ్రెండ్‌ రిక్వెస్ట్ అనే సినిమాతో డైరక్టర్ గానూ మారాడు. ఈ సినిమా నిన్ననే రిలీజైంది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రంలలో కలుపుకుని సినిమాకు 30 ధియేటర్లు వచ్చాయి. ''నిజానికి నా సినిమాకు 150 ధియేటర్లు కావాలి. ఈజీగానే అన్నేసి ధియేటర్లు దొరుకుతాయి అనుకున్నాను. కాని చివరకు హైదరాబాద్‌ లో 20 ధియేటర్లు అడిగితే 1 చేతిలో పెట్టారు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రంలలో 30 ధియేటర్లలో సినిమా రిలీజైంది. 4.5 కోట్లతో తీసిన సినిమాకు ఇలా ధియేటర్లు దొరక్కపోతే.. ఇన్వెస్టుమెంటును ఎలా రికవర్‌ చేసుకుంటాను నేను? అందుకే నా సమస్య తీరేవరకు ధర్నా చేస్తాను'' అంటూ చెప్పాడు ఈ హీరో.

ఇకపోతే ఎక్కవు ధియేటర్లలో సినిమా కనిపించకపోవడం వలన.. అసలు సినిమాను ఎవ్వరూ రివ్యూ కూడా చేయని పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంలో మరి ఆదిత్య ఓం ఫైనాన్షియల్ గా ఎలా గట్టెక్కుతాడో చూడాలి.
Full View

Tags:    

Similar News