అగ్రహీరో ఇంటికి బాంబు బెదిరింపులు

Update: 2021-06-01 07:00 GMT
కోలీవుడ్ అగ్రహీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు రావ‌డం క‌ల‌క‌లం రేపింది. అజిత్ ఇంట్లో బాంబు పెట్టిన‌ట్టు గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఫోన్ కాల్ చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు వెంట‌నే రంగంలోకి దిగారు. జాగిలాల‌తో అజిత్ ఇంటికి చేరుకున్నారు. తమిళ‌నాడులోని తిరువాన్మియూరులో ఉన్న‌ అజిత్ నివాసాన్ని అణువ‌ణువూ గాలించారు.

అయితే.. ఎలాంటి బాంబులూ క‌నిపించ‌క‌పోవ‌డంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అటు కుటుంబ స‌భ్యులు కూడా తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఇదంతా ఎవ‌రో ఆక‌తాయిలు చేసిన ప‌నిగా భావిస్తున్న‌ పోలీసులు.. వారిని వెతికిప‌ట్టుకునే ప‌నిలో ప‌డ్డారు.

ఇక‌, అజిత్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. త‌లా అప్ క‌మింగ్ మూవీ ‘వాలిమై’. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ కోసం ఫ్యాన్స్ క‌ళ్ల‌లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. ప్ర‌ముఖ‌ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా.. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ వినోద్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.




Tags:    

Similar News