డైరెక్టరే కాదు.. హీరో కూడా మహేష్ విలనే

Update: 2016-12-13 04:38 GMT
మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రానికి ఇంకా టైటిల్ డిసైడ్ చేయని సంగతి తెలిసిందే. రీసెంట్ గా సంభవామి అనే టైటిల్ ని నిర్మాతలు రిజిస్టర్ చేయించారు కానీ.. దీనికి అంతగా రెస్పాన్స్ రాకపోవడంతో ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతం పిక్చరైజేషన్ మాత్రం అహ్మదాబాద్ లో సూపర్ స్పీడ్ లో జరిగిపోతోంది.

తాజాగా ఈ చిత్రంలోకి కోలీవుడ్ హీరో భరత్ ను తీసుకున్నారు. ఈ విషయాన్ని భరత్ ధృవీకరించాడు కూడా. 'కొన్ని రోజుల క్రితం నాకు మురుగదాస్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. స్టోరీతో పాటు నా కేరక్టర్ ని కూడా డీటైల్డ్ గా వివరించారు. నేను నెగిటివ్ రోల్ పోషించి చాలా కాలం అయింది. ఈ మూవీలో ఎస్ జే సూర్య విలన్ గా నటిస్తున్నా.. నా రోల్ చాలా సాలిడ్ గా ఉంటుందని.. మంచి ప్రాధాన్యత ఉన్న రోల్ అని చెప్పారు మురుగదాస్. ఇప్పటికే అహ్మదాబాద్ లో నా పోర్షన్ లో కొన్ని సీన్లు పూర్తి చేశాం. త్వరలో పూనే.. బ్యాంకాక్.. హైద్రాబాద్ షెడ్యూల్స్ జరగాల్సి ఉండగా.. వాటిలో కూడా నేను పాల్గొంటా' అని చెప్పాడు భరత్.

తన ఎంత పెద్ద హీరో అయినా మహేష్ ఎప్పుడూ కూల్ గా ఉంటాడని.. అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారంటూ సూపర్ స్టార్ ని ఆకాశానికి ఎత్తేశాడు ఈ హీరో. త్వరలో మహేష్ కాంబినేషన్ లో కొన్ని ఇంపార్టెన్స్ సీన్స్ లో పాల్గొనబోతున్నాడట భరత్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News