అన్నపూర్ణ నుండి గీతకు షిప్ట్‌ అయిన హీరో కమ్‌ డైరెక్టర్‌

Update: 2021-03-18 01:30 GMT
హీరోగా అందాల రాక్షసి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రాహుల్ రవీంద్రన్ ఆ తర్వాత పలు సినిమా లు చేశాడు. హీరోగా వర్కౌట్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ప్రయత్నించాడు. అలా కూడా రాహుల్‌ కు కలిసి రాలేదు. దాంతో రాహుల్‌ దర్శకుడిగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. రాహుల్‌ దర్శకుడిగా మొదటి సినిమా ను అన్నపూర్ణ  స్టూడియోస్ బ్యానర్‌ లో చి.ల.సౌ గా తెరకెక్కించాడు. చిన్న సినిమా గా రూపొందిన ఆ సినిమా పెద్ద సక్సెస్‌ అయ్యింది. దాంతో నాగార్జునను డైరెక్ట్‌ చేసే అవకాశంను దక్కించుకున్నాడు. కింగ్‌ కెరీర్‌ లో బిగ్గెస్ట్‌ సక్సెస్ చిత్రాల్లో ఒక్కటి అయిన మన్మధుడు సినిమా టైటిల్‌ ను తీసుకుని మన్మధుడు 2 గా ఒక సినిమాను రూపొందించి తీవ్రంగా నిరాశ పర్చాడు.

దర్శకుడిగా మొదటి రెండు సినిమాలను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌ లో చేసిన రాహుల్‌ రవీంద్ర మూడవ సినిమా స్క్రిప్ట్ పట్టుకుని సరైన అవకాశం కోసం వెయిట్‌ చేస్తున్నాడు. మరో అవకాశంను అన్నపూర్ణ వారు ఇస్తారేమో అంటూ ఇన్నాళ్లు వెయిట్‌ చేసిన రాహుల్‌ చివరకు గీత ఆర్ట్స్‌ వైపు చూసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే బన్నీ వాసుకు రాహుల్‌ ఒక కథ చెప్పాడని ఆ కథ కు మెగా కాంపౌండ్ ఓకే చెప్పిందనే ప్రచారం జరుగుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో రాహుల్‌ దర్శకత్వంలో తదుపరి సినిమా ఉంటుందని మీడియా సర్కిల్స్ ద్వారా సమాచారం అందుతోంది.

చిన్న బడ్జెట్‌ చిత్రాలను వరుసగా నిర్మిస్తున్న జీఏ2 బ్యానర్‌ త్వరలోనే రాహుల్‌ తో సినిమాను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అల్లు అరవింద్ సమర్పణ అవ్వడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉండే అవకాశం ఉంది. రెండు సినిమాల్లో ఒకటి  హిట్ ఒకటి ఫట్‌ అవ్వడంతో రాహుల్‌ చేయబోతున్న మూడవ ప్రాజెక్ట్‌ ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News