తమిళ స్టార్ హీరో ధనుష్ ఉండేదే చాలా బక్కగా. ఈ మద్య కాలంలో ఆయన మరీ ఇంకా బక్కగా కనిపిస్తున్నాడు. ఉన్నట్లుండి ధనుష్ మరీ ఇంత బక్కగా అయ్యాడేంటి అంటూ అభిమానులు గత కొన్ని రోజులుగా చర్చించుకుంటున్నారు. వారి అనుమానాలకు ప్రశ్నలకు సమాధానంగా ధనుష్ తాజాగా ఒక వీడియోను బయటకు లీక్ చేశాడు. సోషల్ మీడియాలో ధనుష్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
గతంలో ధనుష్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించిన విషయం తెల్సిందే. మళ్లీ ఇప్పుడు ధనుష్ సిక్స్ ప్యాక్ బాడీ చేశాడు. సిక్స్ ప్యాక్ బాడీ కోసం వర్కౌట్స్ చేస్తున్న కారణంగానే ఇంత బక్కగా అయ్యాడు. వీడియోలో ధనుష్ ఏ స్థాయిలో వర్కౌట్స్ చేస్తున్నాడో చూడవచ్చు. ఇక ధనుష్ మారి 2 ఆశించిన స్థాయిలో ఆకట్టుకోక పోవడంతో తదుపరి చిత్రంపై మరింత శ్రద్దను ధనుష్ చూపిస్తున్నాడు.
ప్రస్తుతం ధనుష్ చేతిలో నాన్ రుద్రన్ చిత్రంతో పాటు పలు చిత్రాలు ఉన్నాయి. నాన్ రుద్రన్ చిత్రానికి స్వయంగా ఆయనే దర్శకత్వం వహించబోతున్నాడు. ధనుష్ ఏ చిత్రం కోసం ఇలా సిక్స్ ప్యాక్ కు మారాడు అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ధనుష్ బక్కగా ఉన్నా ఆయన మజిల్స్ ఇంకా బాడీ అదుర్స్ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.