హీరో గోపీచంద్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..

Update: 2022-04-30 06:31 GMT
ప్రస్తుతం తెలుగు హీరోలు భారీ యాక్షన్ ఉన్న సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో ఫ్యాన్స్ కు రియాలిటీ చూపించాలని భావిస్తున్నారు. అందుకే డూపుల‌కు బ‌దులు ఆడియెన్స్ ను థ్రిల్ చేసేందుకు స్వయంగా నేరుగా మేమే యాక్షన్ సీన్లలో కనిపిస్తాం అంటున్నారు. ముఖ్యంగా నాగార్జున లాంటి స్టార్ హీరోలు సైతం కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు..భారీ యాక్షన్ ఉన్న కథలను ఎంచుకోవడం వల్ల త‌రుచూ షూటింగ్ లలో వీరికి గాయాలు అవుతున్నాయి.

షూట్ స్పాట్ లో స్టంట్ మాస్ట‌ర్లు జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ ప్ర‌మాదాలు మాత్రం జ‌ర‌గ‌డం ఆగ‌డం లేదు. ఇప్పటికే చాలా మంది హీరోలకు షూటింగ్ సమయంలో గాయాలు అయ్యాయి..వీరంతా కొద్ది రోజుల పాటు గ్యాప్ తీసుకొని మళ్ళీ షూటింగ్ ల‌లో పాల్గొన్నారు. అవ‌న్నీ చిన్న,చిన్న ప్రమాదాలే కావ‌డం గాయాలు కూడా తొంద‌ర‌గానే త‌గ్గిపోవ‌డంతో సంబంధిత యూనిట్ వ‌ర్గాల వారు ఊపిరి పీల్చుకున్నారు.

ఇప్పుడు మరో స్టార్ హీరో  గోపీచంద్ కు గాయాలు అయ్యాయి. ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో హీరో గోపీచంద్ 30వ చిత్రం తెరకెక్కుతోంది. మైసూర్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో పొరపాటున కాలు జారి కింద పడ్డాడు..కొంత ఎత్తైన ప్రదేశం నుండి క్రింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. మరేమీ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదని అంటున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ వ‌ర్గాలు ఈ విష‌యాన్ని తెలియజేశాయి.

భగవంతుడు దయతో ప్రమాదంలో గోపీచంద్-కి ఎటువంటి గాయాలు కాలేదు..అభిమానులు, కుటుంబ సభ్యులు కంగారు పడవద్దని మేకర్స్ అంటున్నారు. గోపీచంద్ ఇంత‌కు ముందు కూడా చాలా సార్లు షూటింగ్ సమయంలో కింద పడిపోయాడు. అదృష్ట‌వ‌శాత్తు చిన్న‌,చిన్న గాయాల‌తో ఒడ్డెక్కాడు. కానీ 2019లో విడుదలైన చాణక్య మూవీ షూటింగ్ సమయంలో  తీవ్ర గాయాలపాలయ్యారు.

ఇక తాజా సినిమా వివ‌రానికే వ‌స్తే...2007లో విడుదలైన లక్ష్యం సూపర్ హిట్ కాగా.. ఆ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. మ‌రోవైపు క‌లెక్ష‌న్ సినిమాల‌కు కేరాఫ్ గా నిలిచే మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతోంది.

ఈ మూవీలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక విజయాల పరంగా గ‌త కొద్ది కాలంగా వెనుకబడిన గోపీచంద్ తన రాబోయే చిత్రాలపై చాలా ఆశలు పెట్టుకున్నారు. 'సింగం' సిరీస్‌ను తెరకెక్కించిన తమిళ దర్శకుడు హరి  గోపీచంద్-తో ఓ భారీ యాక్షన్ సినిమాను చేయాలని భావిస్తున్నార‌ని స‌మాచారం. అయితే ఇంకా ఆ సినిమా పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.ఏదైతేనేం హీరో గోపీచంద్ సేఫ్.. థాంక్ గాడ్.
Tags:    

Similar News