నిర్మాతగా మారినప్పటి నుంచి ఎక్కువగా యువ కథానాయకులతో అభిరుచి ఉన్న సినిమాలు తీశాడు దిల్ రాజు. ఐతే ఆయన నాని లాంటి మంచి టేస్టున్న యంగ్ హీరోతో ఇంతకాలం సినిమా చేయకపోవడం ఆశ్చర్యమే. ఎట్టకేలకు వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘నేను లోకల్’ సినిమా తెరకెక్కింది. ఐతే దిల్ రాజుతో తన కెరీర్ ఆరంభంలోనే చేయాల్సిందని.. ఆయన చాలా కథలు కూడా వినిపించారని.. కానీ అవేవీ నచ్చకపోవడంతో ఇన్నాళ్ల పాటు తమ కాంబినేషన్లో సినిమా రాలేదని చెప్పాడు నాని. ఈ విషయంలో తనను కొందరు మిత్రులు హెచ్చరించినట్లు కూడా నాని తెలిపాడు.
‘‘దిల్ రాజు గారితో నేను ఎప్పుడో సినిమా చేయాల్సింది. నా రెండో సినిమా అప్పట్నుంచి ఆయన నాకు చాలా కథలు తీసుకొచ్చి వినిపిస్తూ వచ్చారు. ఎందుకో మా కాంబినేషన్ కుదిరేది కాదు. దిల్ రాజు సినిమాను కాదంటే ఎలా అంటూ సన్నిహితులు హెచ్చరించేవారు కూడా. ఐతే ఎలాగైనా మేం కలిసి ఒక సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నాం. ‘నేను లోకల్’తో అన్నీ కుదిరి రాజు గారితో పనిచేసే అవకాశం దక్కింది’’ అని నాని తెలిపాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ తో తొలిసారి పని చేసిన అనుభవంపై నాని మాట్లాడుతూ.. ‘‘దేవికి నా సినిమాలంటే ఇష్టం, నాకు దేవి మ్యూజిక్ అంటే ఇష్టం. మా కాంబినేషన్లో ఓ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలాసార్లే ఎదురుచూశా. చివరకు ‘నేను లోకల్’తో అది సాధ్యమైంది. సినిమా విడుదలకు ముందే పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయంటే ఆ క్రెడిట్ పూర్తిగా దేవీకే దక్కాలి’’ అని చెప్పాడు.