ఆ మధ్య నాని విక్రమ్ కుమార్ ల కాంబో సినిమాకు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు మెగా ఫాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యింది. కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన ఆ మూవీని మెగా హీరోలు వాడితేనే ఆలోచిస్తామని అలాంటిది నాని లాంటి సాఫ్ట్ హీరోకి పెట్టుకోవడం ఏంటని సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఇది చాలదన్నట్టు ఒక దర్శక నిర్మాత ఇది తమ టైటిల్ అంటూ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేశామంటూ ఏకంగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసాడు. రెండు సంస్థల మధ్య చర్చలు జరిగినట్టు టాక్ వచ్చింది ఆ తర్వాత అంతా గప్ చుప్ అయిపోయింది.
దీని గురించి ఎప్పుడు అడుగుదామన్నా దొరకని నాని జెర్సి ప్రమోషన్ లో మాట్లాడక తప్పలేదు. గ్యాంగ్ లీడర్ అంటే తనకు చాలా గౌరవమని తమ కథకు ఈ టైటిల్ తప్ప ఇంకేదీ యాప్ట్ కాదని సినిమా చూసాక మీరే ఒప్పుకుంటారని అలా కాదు అనిపిస్తే అప్పుడు చూద్దామని చెప్పాడు. అంటే ఇక్కడ నాని చెప్పింది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళను వచ్చి సినిమా చూడమనా లేక రిలీజయ్యాక అభిమానులు చూసి అప్పుడు రియాక్ట్ కమ్మనా అర్థం కాలేదు.
ఒకవేళ రెండోది నిజమైతే థియేటర్లలోకి అడుగు పెట్టాక ఎవరైనా చేయగలిగింది ఏమి లేదు. బాగున్నా బాగాలేకపోయినా సర్దుకోవాల్సిందే. ఏది జరిగినా ముందే అయిపోవాలి. మరి నాని సినిమా చూసాక నిర్ణయించండి అని చెప్పడంలో ఆంతర్యం ఎవరికీ అర్థం కాలేదు. సరే ఇప్పుడు జెర్సి మూడ్ లో ఉన్నాడు కాబట్టి ఇంత కన్నా రెట్టించి అడిగే అవకాశం మీడియాకు లేకపోయింది. దసరాకు టార్గెట్ చేసుకున్న జెర్సి షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది.