తెలుగులో ‘స్టార్’ అనే పదానికి అర్థం మారుతోందంటున్నాడు నాని. భవిష్యత్తులో అసలే హీరో కూడా స్టార్ కాదని నాని చెప్పాడు. ‘‘గత కొన్ని దశాబ్దాల్లో స్టార్ అనే పదానికి అర్థం మారింది. మొదట్లో ఎన్టీఆర్ గారు భారీ పాత్రలు చేసేవాళ్లు. ఆయన పెద్ద స్టార్ అయ్యారు. తర్వాత చిరంజీవిగారు డ్యాన్సులు.. ఫైట్లతో తన ప్రత్యేకత చాటుకున్నారు. పెద్ద స్టార్ అయ్యారు. ఆ తర్వాత మహేష్ బాబు తన లుక్స్.. సటిల్ యాక్టింగ్ స్టైల్ తో స్టార్ అయ్యారు. నా దృష్టిలో ఇకపై స్టార్ అనే పదానికి అర్థం మారుతుంది. రాబోయే రోజుల్లో కంటెంటే బిగ్గెస్ట్ స్టార్ అవుతుందని నా అభిప్రాయం’’ అని నాని విశ్లేషించాడు.
ఇక తన వరకు తాను స్టార్ కాదని నాని స్పష్టం చేశాడు. ‘‘నేను ఏ స్టార్ లీగ్ కూ చెందను. నెంబర్ రేసులో ఉండను. నా సినిమాలు.. నా నటన అంతా డిఫరెంట్. నేనెప్పుడూ నటుడిగానే ఉంటాను. స్టార్ కాదు. ఒకవేళ స్టార్ ఇమేజ్ ఉందనిపించినా.. అది నా సినిమాలు హిట్టయ్యే వరకే. నా సినిమాల వసూళ్ల గురించి.. బిజినెస్ గురించి కూడా నేను పెద్దగా పట్టించుకోను. ఓ కథ ఎంచుకునేటపుడు ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అని చూస్తా. విడుదల తర్వాత రెస్పాన్స్ ఎలా ఉందో చూస్తా. వీటి మీదే ప్రధానంగా నా దృష్టి ఉంటుంది. అందుకే నా ప్రతి సినిమానూ నేను థియేటరుకు వెళ్లి ప్రేక్షకులతో కలిసి చూస్తా. నేను కథ విషయంలో.. సన్నివేశాల విషయంలో ఎలా ఫీలయ్యానో అలాగే ప్రేక్షకులు కూడా ఫీలవుతున్నారో లేదో చూస్తాను. దాన్ని బట్టే సినిమాలు ఎంచుకుంటాను’’ అని నాని చెప్పాడు.