హీరోల మధ్య స్నేహం గురించి నిరంతరం అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతుంటుంది. ఇటీవల మన హీరోలంతా ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ ఒకరి సినిమాలకు ఒకరు ప్రచారం చేస్తున్నారు. ఒకరి ఈవెంట్లకు ఒకరు అటెండవుతున్నారు. మహేష్-చరణ్-ఎన్టీఆర్-ప్రభాస్-అల్లు అర్జున్ .. వీళ్లంతా ఒక బ్యాచ్ లాగా కలిసిపోయారు. ఎవరి ఇళ్లలో ఏ వేడుకలు ఉన్నా కుటుంబ సమేతంగా ఎటెండవుతున్నారు. ఇది పరిశ్రమలో సామరస్యాన్ని పెంచుతోందన్న మంచి మాటా వినిపిస్తోంది.
అయితే నేటితరం హీరోల్లో ఈ స్నేహం పాళ్లు ఏ లెవల్లో ఉంది? అంటే నిన్నటి సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన `నిను వీడని నీడను నేను` ఈవెంట్ ని చూడాల్సిందే. ఈ వేదికపై యువహీరోలు సందీప్ కిషన్- నిఖిల్ - సుధీర్ బాబు- కార్తికేయ - విశ్వక్ సేన్ ఒకే వరుసలో నిలబడి ఎంతో సందడి చేశారు. అంతేకాదు సందీప్ సినిమా పెద్ద హిట్టవ్వాలని ఇతర హీరోలు ఎంతో స్నేహంగా బ్లెస్ చేశారు. ఈ వేదిక పై ఎనర్జిటిక్ హీరో నిఖిల్ చెప్పిన ఓ మాట ఎంతగానో ఇంప్రెస్ చేసింది. ``సినిమా యాక్టర్ల మధ్య కాంపిటీషన్ ఉంటుందని.. ఒకరి సినిమా గురించి ఇంకొకరు మాట్లాడుకుంటారనేవి మధ్యలో వాళ్లు చెప్పే విషయాలని సందీప్ కిషన్ ని కలిసిన తరవాత అర్థమైంది. మేం ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్లం కాదు. ఒక్కసారి మాట్లాడటం మొదలుపెట్టిన తరవాత మాటలు ఆగలేదు`` అని నిఖిల్ అన్నారు. ప్రీరిలీజ్ కి వస్తున్నా అని నేనే సందీప్ కి కాల్ చేసి వెళ్లానని నిఖిల్ వెల్లడించారు. అంతేనా `నిను వీడని నీడను నేను` సినిమా కోసం నిర్మాతగానూ జాయిన్ అవుతానని సందీప్ ని అడిగానని నిఖిల్ తెలిపారు. సినిమా బాగా వస్తోందని విని డబ్బు పెడతానన్నా. జీవితంలో మనం కింద పడతాం. పైకి లేస్తాం. ఎప్పుడూ నిరాశ పడకూడదు. ఈ సినిమా తరవాత సందీప్ కిషన్ పైన ఉంటాడు. తను పైకి లేచే టైమ్ మొదలైంది. ఎవరూ ఆపలేరు`` అని నిఖిల్ వ్యాఖ్యానించాడు.
ఇక ఈ వేదిక పై సందీప్ కిషన్ ఎంతో ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ``మన పని మనం చేసుకుంటూ వెళతాం. కానీ ఒకడు ఒక సినిమా తీస్తున్నాడంటే... సంబంధమే లేకుండా ఆ సినిమాను ఆపడానికి కొందరు బయలుదేరతారు`` అని వ్యాఖ్యానించారు. అన్నిటి కన్నా సినిమా గొప్పది. ఆ సినిమాను ఆ సినిమా కాపాడుకుంటూ వస్తుందని కాస్తంత వేదాంత ధోరణితోనే సందీప్ మాట్లాడడం ఆసక్తిని రేకెత్తించింది. నిను వీడని నీడను నేను ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే.