యంగ్ హీరో నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా షూటింగ్ కోసం గుజరాత్ వెళ్లారు. అక్కడ షూటింగ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో అనూహ్యంగా ఆయన ఎడమ కాలుకు ప్రమాదవశాత్తు గాయం అయ్యింది. దాంతో హుటాహుటిన ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితిపై అభిమానులు మరియు ఇండస్ట్రీలో ఆయన సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనకు జరిగిన ప్రమాదం మరియు గాయం పై హీరో నిఖిల్ స్పందించాడు. ఆయన సోషల్ మీడియా ద్వారా తన కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు.
నిఖిల్ సోషల్ మీడియా ద్వారా... చాలా మంది ప్రమాదం విషయం తెలిసి ఫోన్ లు చేశారు మెసేజ్ లు చేసి ఎలా ఉందని యోగ క్షేమం కనుక్కున్నారు. నా కోసం చాలా మంది ప్రార్థించారు. వారందరికి కూడా కృతజ్ఞతలు. రెట్టింపు ఉత్సాహంతో అతి త్వరలోనే మీ ముందుకు వస్తాను అంటూ తన సమాచారంను అభిమానులతో పంచుకున్నాడు. కార్తికేయ 2 సినిమా కు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. నిఖిల్.. చందు మొండేటి కాంబోలో గతంలో వచ్చిన కార్తికేయ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు సీక్వెల్ ను రూపొందిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అయిన కార్తికేయ 2 సినిమాను ఈ ఏడాది లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.