పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం అనేది ప్రతీ హీరో కల. తన ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాకుండా.. యావత్ దేశానికి తాను పరిచయమై, నేషనల్ స్టార్ అవ్వాలనే ప్రతిఒక్కరూ కోరుకుంటారు. ఇదే విషయమై టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ స్పందించాడు. బాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు.
ప్రస్తుతం రామ్ తన లేటెస్ట్ మూవీ 'రెడ్' ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం.. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ మొత్తం ఏడు భాషల్లో రిలీజ్ అవుతోంది. రామ్ గత చిత్రాలేవీ ఇన్ని భాషల్లో రిలీజ్ కాలేదు. దీంతో సహజంగానే ఒక అటెన్షన్ నెలకొంది.
కాగా.. సౌత్ లోని చాలా మంది స్టార్లు పాన్ ఇండియన్ స్టార్ గా ఎదగడానికి ట్రై చేస్తున్నారు. టాలీవుడ్లో రూపొందుతున్న పలు సినిమాలు పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొనే తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ ఎంట్రీపై హీరో రామ్ ను అడగ్గా ఈ విధంగా స్పందించాడు.
తన 'రెడ్' మూవీ ఏడు భాషల్లో రిలీజ్ చేస్తున్నది తన మార్కెట్ ను ఇండియా వైడ్ విస్తరించడానికి మాత్రమేనని చెప్పాడు రామ్. ప్రస్తుతానికి స్ట్రెయిట్ గా హిందీ సినిమాలు చేయడానికి తనకు ఆసక్తి లేదని కూడా చెప్పాడీ ఎనర్జిటిక్ హీరో.
ఇక, తెలుగులోనూ రామ్ చేయబోయే నెక్స్ట్ మూవీ ఏంటన్నది క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకూ పలు కథలు విన్న రామ్.. ఏదీ ఫైనల్ చేయలేదు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరనేదానిపైనా స్పష్టత లేదు. త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేస్తాడనే టాక్ వచ్చిందికానీ.. ఎవరూ ధృవీకరించలేదు.