బొమ్మరిల్లు రూపంలో ఒక్క సినిమాతోనే ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్దార్థ్ ఎక్కువ కాలం తెలుగులో నిలదొక్కులేకపోయాడు. మధ్యలో అడపాదడపా రెండు మూడు సక్సెస్ లు వచ్చాయి కాని అవేవి దాని స్థాయిలో పేరు ఇవ్వకపోవడంతో తక్కువ టైంలోనే తమిళ్ వైపు వెళ్ళిపోయి అక్కడే సెటిలైపోయాడు. రెండేళ్ళ క్రితం గృహం అనే హారర్ మూవీ ద్వారా పలకరించి సక్సెస్ కొట్టినా కథ మళ్ళి మొదటికే వచ్చింది.
నటుడిగా సిద్ధార్థ్ ని కాసేపు పక్కన పెడితే అతనిలో మంచి సింగర్ ఉన్నాడు. బొమ్మరిల్లుతో పాటు ఓయ్-ఓ మై ఫ్రెండ్ లో పాటలు పాడి ఆ రకంగా కూడా మెప్పించాడు. మళ్ళి ఇన్నాళ్ళకు ఓ తెలుగు సినిమా కోసం స్వరం సవరించుకుంటున్నాడు. సందీప్ కిషన్ హీరోగా నిర్మాతగా తీస్తున్న నిను వీడని నీడను నేనేలో సిద్ధార్థ్ ఓ పాట పాడాడు. దీని రికార్డింగ్ మొన్న సోమవారం పూర్తి చేసారు. కార్తీక్ రాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
గత కొన్నేళ్ళుగా సక్సెస్ లేక బాగా స్ట్రగుల్ అవుతున్న సందీప్ కిషన్ ఈ కథ విపరీతంగా నచ్చడంతో నిర్మాతగా మారేందుకు రెడీ అయ్యాడు. మొన్న శివరాత్రికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. సిద్ధార్థ్ తో సందీప్ కున్న స్నేహం వల్లే పాడేందుకు అంగీకరించాడని యూనిట్ టాక్. సిద్దార్థ్ సరైన సబ్జెక్టు తో స్ట్రెయిట్ మూవీ చేయాలే కాని చూసే అభిమానులు లేకపోలేదు. ఇప్పటికిప్పుడు ఛాన్స్ లేదు కాని ఫ్యాన్స్ ప్రస్తుతానికి ఈ పాటతో సర్దుకోవలసిందే