హీరో శ్రీకాంత్ చూడ్డానికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తాడు కానీ.. లోపల మనిషి వేరే ఉన్నాడనడానికి ఇదే రుజువు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రోడ్డు మీద.. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో సొంత డ్రైవింగ్ తో ప్రయాణం సాగించి సంచలనం సృష్టించాడు శ్రీకాంత్. మొత్తం ఆరు వేల కిలోమీటర్లు శ్రీకాంత్ బృందం రోడ్ ట్రిప్ సాగడం విశేషం. ఈ మధ్య సినిమాలు కూడా పెద్దగా ఏమీ లేకపోవడంతో తన మిత్రులతో కలిసి ఈ సాహస యాత్ర చేపట్టాడు శ్రీకాంత్.
ఎంతోకాలంగా ఈ సాహస యాత్రం చేయాలనుకుంటున్న శ్రీకాంత్.. కొన్ని రోజుల కిందటే ఈ యాత్రకు బయల్దేరాడు. తన చిన్ననాటి స్నేహితులు నలుగురుతో కలిసి శ్రీకాంత్ జున్ 17న హిమాలయాలకు రోడ్ ట్రీప్ మొదలుపెట్టాడు. పది రోజుల్లోనే ఆరు వేల కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. ఢిల్లీ.. శ్రీనగర్ మీదుగా కార్గిల్ వెళ్లి.. అక్కడే అమరవీరుల సమాధి దగ్గర నివాళులు అర్పించింది శ్రీకాంత్ బృందం.
18 వేలకు పైగా అడుగుల ఎత్తులో అతి ప్రమాదకరమైన ఘాట్ రోడ్డులో శ్రీకాంత్ సొంతంగా వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ ప్రయాణం సాగించడం విశేషం. మోటర్ వాహనాల ద్వారా ప్రయాణానికి అవకాశమున్న ప్రపంచంలోని ఎత్తైన ప్రదేశం ఖర్దుంగ్లాకు శ్రీకాంత్ బృందం వెళ్లింది. అదే దారిలో ప్రపంచంలోనే రెండో ఎత్తయిన సాస్ టగ్లాంగలాను కూడా వీరు దర్శించారు. లడక్ మీదుగా మనాలి చేరుకుని.. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారు. పర్యటన చేస్తున్నపుడు ఏం అనిపించలేదని.. ఇప్పుడు తాము చేసిన సాహసం భయం గొలుపుతోందని శ్రీకాంత్ చెప్పడం విశేషం.