1980, 90లలో తెలుగులో వరుసగా విజయాలను దక్కించుకున్న సుమన్ సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా వందల సినిమాల్లో నటించాడు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ మొత్తం అన్ని భాషల్లో కలిసి 400 పైగా సినిమాలను సుమన్ చేశాడు. అయితే తెలుగులో సుమన్ 100వ సినిమాకు చేరువ అయ్యాడు. తెలుగు ప్రేక్షకులు తనకు చాలా ప్రత్యేకం అని, తెలుగులో తాను స్టార్ డం దక్కించుకున్న కారణంగా టాలీవుడ్ లో తన వందవ సినిమాను చాలా ప్రత్యేకంగా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
తెలుగులో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో కనిపించిన సుమన్ తన 100వ సినిమాతో ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. సందేశాత్మక చిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాతలు సాహసం చేయరు. దాంతో తన 100వ సినిమాను తానే స్వయంగా నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. త్వరలోనే సుమన్ ఆ ప్రతిష్టాత్మక మూవీ గురించిన అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. తెలుగులో నేటి భారతం వంటి సందేశాత్మక చిత్రంతో సుమన్ కు స్టార్ డం దక్కింది. మళ్లీ ఇన్నాళ్లకు అదే తరహా మూవీతో సుమన్ రావాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
హీరోగా తెలుగులో ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణలతో పోటీ పడిన సుమన్ ఆ తర్వాత ప్రాభవంను కోల్పోయాడు. హీరోగా అవకాశాలు రాకున్నా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా నటించి వంద సినిమాలకు చేరువ అయ్యాడు. ఒక వైపు నటిస్తూనే మరో వైపు సామాజిక సేవ చేస్తూ వస్తున్న సుమన్ తన ప్రతిష్టాత్మక వందవ సినిమాతో ఎలాంటి సందేశాన్ని ఇస్తాడో చూడాలి.