రాజ‌మౌళిని స్కైలో లేపాడు!

Update: 2019-01-30 11:48 GMT
చిరంజీవి, బాల‌కృష్ణ, రాజ‌శేఖ‌ర్ వంటి స్టార్ల‌తో ధీటుగా పోటీప‌డుతూ హీరోగా రాణించారు సుమ‌న్. 90ల‌లో అగ్ర క‌థానాయ‌కుడిగా టాలీవుడ్ లోనూ పేరు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు, అటు త‌మిళ్, క‌న్న‌డ‌లోనూ న‌టించారాయ‌న‌. అంత‌టి అనుభ‌వం ఉన్న ఆయ‌న `శివాజీ- ది బాస్` చిత్రం త‌ర్వాత అంత మంచి పాత్ర త‌న‌కు రాలేద‌ని భావిస్తున్నారా?  ఇటీవ‌ల త‌న స్థాయికి త‌గ్గ పాత్ర రాలేద‌ని ఆయ‌న అనుకుంటున్నారా?  ఇదే ప్ర‌శ్న త‌ననే ఎక్స్ క్లూజివ్ గా అడిగేస్తే ఏమ‌న్నారో తెలుసా?  

శివాజీ సినిమా వేరు.. ఆ గ్రాండియారిటీ వేరు. శివాజీ చూసిన‌ప్పుడు  సుమ‌న్ విల‌న్ ఏంటి? అన్నారు.  అన్న‌మ‌య్య చేసిన‌ప్పుడు సుమ‌న్ వెంక‌టేశ్వ‌ర స్వామి ఏంటి? అన్నారు. ఆ త‌ర్వాత అలా అన్న వాళ్లే పొగిడారు. ఒక స్థాయికి వ‌చ్చాక మాకు ట్యాలెంట్ నిరూపించుకునేలా మంచి పాత్ర‌ల్ని ఇవ్వాలి. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ను నేను ఇదే అడుగుతాను. మంచి విలన్ పాత్ర‌లు ఇవ్వ ండి. చేయ‌ను అని అన‌ను. ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌కు ప‌దే ప‌దే నేను ఇదే చెబుతున్నా. సుమ‌న్ చేయ‌డు అని చెప్ప‌ను. విల‌న్ కి ఎంత ప‌వ‌ర్ ఇస్తారు అన్న‌ది ఆలోచిస్తాను.. అని అన్నారు.

ఈ జ‌న‌రేష‌న్ ద‌ర్శ‌కులు విల‌నీని అంత బాగా చూపించ‌లేద‌ని అసంతృప్తి ఉందా? అన్న ప్ర‌శ్న‌కు ``రాజ‌మౌళిని చూడండి. ఆయ‌న ఈ జ‌న‌రేష‌న్ డైరెక్ట‌ర్. విలన్‌ కి ఎంత‌టి ప‌వ‌ర్ ని ఇస్తున్నారో`` అంటూ ఉటంకించారు. నేటి జ‌న‌రేష‌న్ లో రాజ‌మౌళి మాత్రం విల‌న్ ని ఎంతో గొప్ప‌గా చూపిస్తున్నారు. ప‌రిశ్ర‌మ ఏదైనా విల‌నీ ఉన్న సినిమాలే గెలుస్తున్నాయి. త‌మిళం, మ‌ల‌యాళం స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో ఇది ఉంది. బాహుబ‌లి లో ప్ర‌భాస్ కాదు రానా హీరో. చివ‌రిలో రానా ఫైర్ లో ప‌డిపోతాడు కానీ, ప్ర‌భాస్ ఎక్కడా త‌న‌ని తోసేయ‌డు. త‌నే బ్యాలెన్స్ త‌ప్పి ప‌డిపోతాడు. చ‌చ్చే వ‌ర‌కూ అత‌డు ప‌వ‌ర్ ఫుల్. ప్ర‌భాస్ ఎక్క‌డా ట‌చ్ చేయ‌డు. అంటే విల‌న్ చ‌చ్చే వ‌ర‌కూ ఫ‌వ‌ర్ ఫుల్ అని చూపించారు. అది రాజ‌మౌళి వ‌ల్ల‌నే సాధ్య ం . విల‌న్ ని అలా చూపాలంటే గ‌ట్స్ కావాలి.

హీరోలు ప‌ది మంది 20 మందిని కొట్టేయ‌డం, క్లైమాక్స్ లో 40 మందిని కొట్టేయ‌డం ఇదేమీ గొప్ప కాదు. ఇక శివాజీ సినిమాలో విలన్ ఎంత ప‌వ‌ర్ ఫుల్ గా క‌నిపించారో చూశాం. శంక‌ర్ అంత గొప్ప‌గా చేశారు. టాలీవుడ్ లోనూ రాజ‌మౌళి ఇప్ప‌టికే నిరూపించారు. గొప్ప విల‌నీని చూపించారు. ఒక్క‌ సినిమాతోనే కాదు ఎన్నో సినిమాల‌తో దీనిని నిరూపించారు. ఈగ సినిమాలో సైతం డిఫ‌రెంట్ విల‌నిజం క్రియేట్ చేశారు. ఆ విల‌న్ ఈగ‌తో ఫైట్ చేయ‌డం అన్న‌ది క్రియేట్ చేశారు. విల‌న్ కి క‌థ‌లో ఎవ‌రు ప్రాముఖ్య‌త నిస్తారో ఆ సినిమానే హిట్ట‌వుతుంది. చాలామంది హీరో రాగానే 20 మందిని కొట్టేయ‌డం గాల్లో ఎగ‌రేయ‌డం ఇవ‌న్నీ చూపిస్తున్నారు. ఇంటెలెక్చువ‌ల్ గా ఎలా కొట్టాలి? అన్న‌ది రాజ‌మౌళి చూపించారు. విల‌న్ గా అలాంటి ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లు ఇస్తే నేను చేస్తాను. రొటీన్ గా రేప్ లు చేయ‌డం, బ్యాంక్ దోచేయ‌డం వంటి విల‌నీని రాజ‌మౌళి చూపించరు. పాత డ‌బ్బా నుంచి బ‌య‌టికి వ‌చ్చి కొత్త‌గా చేయాలి... అని సూచించారు సుమ‌న్. జ‌క్క‌న్న‌ను ఆయ‌న మ‌రీ ఇంత‌గా బ్ర‌ష‌ప్ చేశారంటే త‌న నుంచి సుమ‌న్ ఇంకేదైనా ఆశిస్తున్నారా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. ఫిబ్ర‌వ‌రి 1న రిలీజ‌వుతున్న బిచ్చ‌గాడా మ‌జాకా చిత్రంలోనూ సుమ‌న్ ఓ ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో న‌టించార‌ట‌.

Tags:    

Similar News