ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో 'పెద్దన్న' ఎవరనే అంశం మీద చర్చలు జరుగుతున్నాయి. ఇండస్ట్రీలో అందరి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యక్తిగా ఎవరుంటారు అనే విషయం మీదే మాట్లాడుకుంటున్నారు. దాసరి నారాయణ రావు తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగిన 'ఇండస్ట్రీ పెద్ద' గా ఎవరంటే బాగుంటుందనే దానిపై పలు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఇదే విషయం ప్రస్తావనకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా సినీ కార్మికులు మాట్లాడుతూ.. ''గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరూ లేరు. ఆ బాధ్యత చిరంజీవి తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే మాకు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆయన ఉన్నారని మాకు ఓ ధైర్యం ఉంటుంది'' అని అన్నారు. దీనికి చిరు స్పందిస్తూ తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండలేనని.. ఇండస్ట్రీ బిడ్డగా ఉంటానని తెలిపారు. కార్మికులకు ఆరోగ్య, ఉపాధి సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా సమగ్ర విశ్లేషణ చేసి వారి కోసం నిలబడతానని పేర్కొన్నారు.
''పెద్దరికం హోదా నాకు ఇష్టం లేదు. నేను పెద్దగా వ్యవహరించను. ఆ పదవి నాకు వద్దు. కానీ, బాధ్యత గల ఒక బిడ్డగా ఉంటాను. అందరి బాధ్యతా తీసుకుంటా. అందుబాటులో ఉంటా. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ముందుకు వస్తా. దానికి మాత్రం ముందుకు వచ్చే ప్రసక్తే లేదు. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు, రెండు యూనియన్ల మధ్య వివాదం జరిగితే.. ఆ తగువులు తీర్చాలని నా వద్దకు వస్తే నేను ఆ పంచాయితీ చేయను'' అని చిరంజీవి అన్నారు.
ఇదే క్రమంలో మరో సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు సినీ పరిశ్రమకు సంబంధించి బహిరంగ లేఖ రాశారు. ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే కాదని.. వేల కుటుంబాలు, జీవితాలని పేర్కొన్నారు. అందరం కలిసి ఒక్కటిగా ఉంటేనే సినిమా బ్రతుకుతుందని.. ఇండస్ట్రీలోని సమస్యలను పరిష్కరించడానికి అందరూ ముందుకురావాలని మోహన్ బాబు పిలుపునిచ్చారు. అప్పటి నుంచి ఇండస్ట్రీ పెద్ద ఎవరనేదానిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా సీనియర్ నటుటు, హీరో సుమన్ ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం తిరుపతిలో ఓ మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారానికి అనుభవజ్ఞులైన పెద్దల సలహాలు తీసుకోవాలని.. ఏ ఒక్కరికో పెద్దరికం కట్టబెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ''నేను సినిమాల్లోకి వచ్చి 44 ఏళ్లలో 10 భాషల్లో దాదాపు 600 సినిమాల్లో నటించాను. ఎలాంటి సహాయ సహకారాలు లేకుండా స్వయంకృషితో ఎదిగాను. ఇండీస్ట్రీలో ఐక్యత లేదనడం అవాస్తవం. కృష్ణ - కృష్ణంరాజు - మురళీ మోహన్ వంటి సీనియర్లు ఇండస్ట్రీలో ఉన్నారు. సమస్యల పరిష్కారానికి వారి సలహా తీసుకోవాలి. సినీ పరిశ్రమలో ఏ ఒక్కరికో పెద్దరికం కట్టబెట్టడం సరికాదు'' అని సుమన్ అన్నారు.