తమిళనాట హీరోగా వెలుగొందుతోన్న తెలుగబ్బాయి విశాల్....అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లోనూ రాణించాలని చూస్తోన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఆర్కే నగర్ నుంచి ఎన్నికల బరిలో దిగిన విశాల్ నామినేషన్ చివరి నిమిషంలో తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. నాటకీయ పరిణామాల మధ్య విశాల్ ను ఆ ఎన్నికలలో పాల్గొనకుండా చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విశాల్ హఠాత్తుగా తన సొంత పార్టీని లాంచ్ చేశాడు. నిన్న తన 40 పుట్టినరోజు సందర్భంగా విశాల్ `మక్కల్ నల ఇయక్కమ్`పార్టీని స్థాపించాడు. విశాల్ తీసుకున్న అనూహ్య నిర్ణయం పలువురిని షాక్ కు గురి చేసింది.
2019 ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో తమిళనాట మరో కొత్త పార్టీ వెలసింది. ఇప్పటికే కమల్, రజనీలు రాజకీయ అరంగేంట్రంపై క్లారిటీ ఇవ్వగా....తాజాగా విశాల్ కూడా ఎన్నికల పందెంలో దిగాడు. తన పార్టీ`మక్కల్ నల ఇయక్కమ్` తో పాటు జెండాను కూడా విశాల్ లాంచ్ చేశాడు. తన ఫొటో ముద్రించి ఉన్న జెండాపై ``అని సెర్వం(అంతా ఒకతాటిపై నడుద్దాం)``అని, ``అన్ బై విత్తైపోమ్(ప్రేమ విత్తనాలు నాటుదాం)``అని స్లోగన్స్ రాసి ఉన్నాయి. ఆ జెండాపై ఒక పక్క అబ్దుల్ కలాం ఫొటో, మరోపక్క మదర్ థెరెస్సా ఫొటో ముద్రించి ఉన్నాయి. వివేగం(వివేకం), విథియాసం(భిన్నంగా ఉండడం), విద ముయార్చి(అంకితభావం)అన్న క్యాప్షన్లున్నాయి. అయితే, తన పార్టీ....రాజకీయ పార్టీలా కాకుండా ఒక స్వచ్ఛంద సేవా సంస్థలాగా పనిచేస్తుందని విశాల్ అన్నాడు. అయితే, రాబోయే ఎన్నికలే లక్ష్యంగా విశాల్ ఈ పార్టీని స్థాపించాడని రాజకీయ, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.