ఫైనల్ గా దాస్ సారీ జెప్పిండు

Update: 2019-06-03 04:45 GMT
నిన్న సోషల్ మీడియాలో తన ఇన్స్ టాగ్రామ్ వీడియో సెల్ఫి గురించి విపరీతమైన నెగటివ్ పబ్లిసిటీ జరగడంతో అది సినిమాకు డ్యామేజ్ అవుతోందని గుర్తించిన హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్ దిద్దుబాటు చర్య తీసుకున్నాడు.  సినిమా నచ్చలేదన్న వాళ్ళను చిన్నపిల్లలను కింద జమకట్టి ఒక్కొక్కడికి ఏదో చేస్తానని ఇక్కడ రాయలేని రెండు అసభ్య పదాలు వాడిన విశ్వక్ సేన్ అవి ఆడియన్స్ నో లేదా రివ్యూ రాసే వాళ్ళనో అన్నవి కాదని  క్లారిటీ ఇచ్చాడు. 

ఓ హీరో అభిమానులు తనను అదే పనిగా టార్గెట్ చేసుకుని ఫలక్ నుమా దాస్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయాడు.  ఎస్ ఆర్ నగర్ లో పోస్టర్లు కూడా చింపారని ఇలా చేయడం వల్ల ఎనభై మందికి పైగా కొత్త ఆర్టిస్టులకు ఉపాధి కలిగించిన సినిమాకు నష్టం కలుగుతుందని ఆ బాధతోనే అలా అన్నానని దానికి ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటె సారీ అని మీడియా ముందు చెప్పేశాడు

విశ్వక్ సేన్ అన్నది ఎవరిని అయినా ఆటిట్యూడ్ పేరుతో ఇలా పబ్లిక్ గా లక్షలాది మందికి చేరిపోయే సోషల్ మీడియాలో బూతులు ప్రయోగించడం మాత్రం సమర్ధనీయం కాదు. అందుకే వారు వీరు అని తేడా లేకుండా ఫేస్ బుక్ ట్విట్టర్స్ లో విశ్వక్ మీద విమర్శల దాడి జరిగింది. ఎక్కువ ఆలస్యం చేయకుండా విశ్వక్ డ్యామేజ్ రిపీర్ చేసుకోవడం మంచిదే.

తన కాళ్ళు పట్టుకుని కిందకు లాగే ప్రయత్నం చేయోద్దంటున్న విశ్వక్ ఇండస్ట్రీలో ఇంత కన్నా దెబ్బలు అవమానాలు తిన్న స్టార్లు సైతం ఇలా ఓవర్ గా ఎన్నడూ రియాక్ట్ అవ్వలేదని గుర్తుపెట్టుకోవడం అవసరం. ఫలక్ నుమా దాస్ డివైడ్ టాక్ తో నడుస్తున్న నేపధ్యంలో ఇలాంటి చర్యలు నష్టాన్ని పెంచుతాయే తప్ప వసూళ్ళకు దోహదపడవు అని తెలుసుకుంటే ఇకపై ఇబ్బందులు రాకుండా ఉంటాయి



Full View
Tags:    

Similar News