ఈమద్య కాలంలో స్టార్ హీరోలు నిర్మాతలుగా మారుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. చిన్న హీరోలు కూడా తమ స్థాయిలో సినిమాలను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాని కొందరు హీరోలు మాత్రం దర్శకత్వం వైపుకు అడుగులు వేస్తున్నారు. ఇటీవలే ‘చిలసౌ’ చిత్రంతో హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయం అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న విషయం తెల్సిందే. అంతకు ముందు కమెడియన్ అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా మారి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. తాజాగా యువ హీరో విశ్వక్సేన్ కూడా దర్శకత్వం వైపు అడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
‘వెళ్లిపోమాకే’ చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విశ్వక్సేన్ కు మొదటి చిత్రం నిరాశ మిగిల్చింది. వెళ్లిపోమాకే చిత్రంను దిల్ రాజు విడుదల చేసినా కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ప్రేక్షకులను అలరించడంలో సినిమా విఫలం అయినా కూడా హీరోగా నటించిన విశ్వక్సేన్ మాత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. మొదటి సినిమానే అయినా కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు అంటూ అందరి నుండి అభినందనలు దక్కించుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో లీడ్ రోల్ పోషించే అవకాశం వచ్చింది. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు.
నటించిన రెండు సినిమాలు కూడా చేదు ఫలితాన్ని మిగల్చడంతో విశ్వక్సేన్ నిరాశ పడకుండా మరో ప్రయత్నంకు సిద్దం అయ్యాడు. ఈసారి డైరెక్షన్ చేస్తూ హీరోగా నటించేందుకు ప్రయత్నిస్తున్నాడు. మలయాళ సూపర్ హిట్ మూవీ అంగామలీ డైరీస్ అనే చిత్రాన్ని రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. తెలుగులో ఈ చిత్రంను రీమేక్ చేసేందుకు స్వయంగా హీరోగా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంను నిర్మించేందుకు ఒక నిర్మాత ముందుకు వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. త్వరలోనే ఈ రీమేక్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. హీరోగా కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకోలేక పోయిన విశ్వక్సేన్ దర్శకుడిగా సక్సెస్‌ను అందిపుచ్చుకుంటాడా అనేది చూడాలి.