చెన్నై బ్యూటీ హిందూ మతంలోకి

Update: 2016-02-24 22:30 GMT
టాలీవుడ్ తో పాటు సౌత్ భాషల్లో చక్రం తిప్పే రేంజ్ లో ఉన్న టాప్ హీరోయిన్ ఆమె. రాబోయే సమ్మర్ లో ఈమె నటించిన సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి. టాప్ రేంజ్ స్టేటస్ బాగానే ఎంజాయ్ చేస్తున్న ఈ హీరోయిన్.. మతం మార్చుకోనుందన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. పుట్టుకతో క్రిస్టియన్ అయిన ఆ హీరోయిన్ ఇప్పుడు మతం మార్చుకోవాల్సిన అవసరం ఏంటంటే.. ప్రస్తుతం ఈమె ఓ పెళ్లైన దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో ఉందని బయట టాక్ వినిపిస్తున్నా.. సన్నిహితులు మాత్రం అది కరెక్ట్ కాందంటున్నారు.

అదే టైంలో అసలు సంగతి వేరే ఉందని కూడా చెబుతున్నారు. మంచి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఓ హీరోని త్వరలో ఈమె పెళ్లి చేసుకోనుందట. ఆ ఫ్యామిలీ మెంబర్లు హిందువులు కావడం.. పెళ్లికి అభ్యంతరం చెప్పకపోయినా మతం విషయంలో మాత్రం పట్టుబడుతున్నారట. ఒకవేళ కేథలిక్ క్రిస్టియన్ అయిన ఈమె.. హిందు మతంలోకి మారితే మాత్రం పెళ్లికి ఓకే అంటున్నారని తెలుస్తోంది. దీనికి ఈమె కూడా సై అనేసిందని తెలుస్తోంది.

ఇలా హీరోయిన్ మతం మార్చుకోవడం మనకు కొత్తేం కాదు.. గతంలో నయన తార కూడా ఇలాగే మతం మార్చుకుని హిందువుగా మారింది. శివాలయంలో ఉంటే తనకు ఎంతో ఓదార్పుగా ఉంటుందని ఓపెన్ గానే చెప్పేసింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ స్టెప్ తీసుకోనున్న హీరోయిన్ .. మతం మారినా పేరు మాత్రం అదే కంటిన్యూ అవుతుందట.
Tags:    

Similar News